ఈ రోజు ‘మిస్టర్‌ మజ్ను’ టీజర్‌ విడుదల…!

mr majnu movie

‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్‌ అక్కినేని హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ మజ్ను’. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. ఇటీవల ఈ చిత్రంలోని ‘ఏమైనదో’, మిస్టర్‌ మజ్ను టైటిల్‌ సాంగ్‌ ను విడుదల చేసారు. కాగా, నూతన సంవత్సర కానుకగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేయనున్నారు.

ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్‌, హైపర్‌ ఆది ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను జనవరి 25న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.