జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ ఎంపీ..!

Avanthi Srinivas Rao
Avanthi Srinivas Rao

ఏపీలో రాజాకీయ వలసలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ప్రతి పక్ష పార్టీ వైసీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. సీటు దక్కదనో.. ఇంకా మంచి పదవి దక్కుతుందనో నేతలు పార్టీలు మారుతున్నారు. నిన్నటికి నిన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి వైసీపీ అధినేత జగన్‌ను కలిసి వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. 24గంటలు కూడా గడవక ముందే విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడి వైసీపీలో చేరారు.

అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్‌ గురువారం ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీపార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు. లోటస్‌పాండ్‌లోని వైఎస్‌ జగన్‌ నివాసంలో వీరి భేటీ జరిగింది. ఈ భేటీ అనంతరం జగన్‌ సమక్షంలో వైసీపీలో అవంతి శ్రీనివాస్‌ చేరారు.ఈ భేటీలో పార్టీ నేతలు విజయసాయిరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.