టైమ్‌ మిషన్‌ ఎక్కుతున్నారు| రవితేజ |రాజా…? డిస్కో రాజా.

Birthday, Raviteja, Teja, Time Meachine, 2019, Disco Raja, Latest, VI Anand, Dual Role, Ram Talluri, Neelaticket, Payal Rajput, Saba Natesh, Priyanka,

పుట్టినరోజుకి ఎవరైనా ఒక సంవత్సరం ముందుకెళ్తారు కదా. కానీ రవితేజ మాత్రం ఓ 20 ఏళ్లు వెనక్కి వెళ్లబోతున్నారట ఈ చితం లో . టైమ్‌ మిషన్‌ కానీ ఎక్కబోతున్నారా? అని అంటే.. అలాంటిదే. దాని పేరే సుమా ‘డిస్కో రాజా’. మాస్‌ రాజా అవుతున్నాడు ‘డిస్కో రాజా’.రవితేజ లేటెస్ట్‌ చిత్రం . ఈ సినిమా 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందని సమాచారం ఉంది. వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో రవితేజ తండ్రీ కొడుకుల్లా ద్విపాత్రాభినయం చేయనున్నారు తెలుస్తుంది.

రవితేజ పుట్టినరోజు (జనవరి 26)న ఈ చిత్రం ప్రారంభం కానుందట చెప్పారు.’డిస్కో రాజా’గా ర‌వితేజ‌ గెటుప్ చూడాలి.ఈ చితం కి నిర్మాత రామ్‌ తాళ్లూరి. రవితేజతో ‘నేల టిక్కెట్టు’కూడా చేసారు. ఇందులో పాయల్‌ రాజ్‌పుత్, నభా నటేశ్, ప్రియాంకా జవాల్కర్‌ హీరోయిన్లుగా నటించ బోతున్నారు. ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌ అంధురాలి పాత్రలో కనిపించనుండటం విశేషం కదా. ఈ చిత్రం 2019 లో ద్వితీయార్ధంలో రిలీజ్‌ కానుంది.