F3 లో ముగ్గురు హీరోల హంగామా

f2

F2 సినిమా సైలెంట్ గా వచ్చి దిమ్మతిరిగే భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.అనిల్ రావిపూడి రైటింగ్ స్కిల్స్,వెంకీ కామెడీ టైమింగ్ ప్రధానబలాలుగా దూసుకుపోతుంది F2.ఇప్పటికే 50 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా ఫుల్ రన్ లో 100 కోట్ల షేర్ ని టార్గెట్ చేసింది.ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి రిపీట్ ఆడియన్స్ గా మారడం విశేషం.దీంతో ఈ సినిమాకి సీక్వెల్ ని అనౌన్స్ చేసారు.అతి త్వరలో దాన్ని సెట్స్ మీదకి తీసుకెళ్లాలి అనేది దిల్ రాజ్ ప్లాన్.అయితే F3 టైటిల్ కి తగ్గట్టే వెంకటేష్ అండ్ వరుణ్ తేజ్ లతో పాటు మరో హీరో కూడా ఈ సీక్వెల్ లో సందడి చెయ్యబోతున్నాడు.ఇంతకుముందు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన రాజా ది గ్రేట్ సినిమాలోని హీరో క్యారెక్టర్ ని F3 లోకి మౌల్డ్ చెయ్యబోతున్నారు.

అలాగే F2 లోని వెంకీ అండ్ వరుణ్ ల క్యారెక్టర్స్ యాస్ ఇట్ ఈజ్ గా వాడబోతున్నారు.వీళ్ళతో పాటు మళ్ళీ మాస్ రాజా రవితేజ కూడా బ్లైండ్ క్యారెక్టర్ తో చేసే కామెడీ కూడా కలిస్తే ఆ హడావుడి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు.వెంకటేష్ కామెడీ టైమింగ్ కి రవితేజ కూడా తోడయితే థియేటర్స్ లో నవ్వుల పువ్వులు,బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల గలగలలు ఖాయం.ఒక సినిమాలో లో క్యారెక్టర్ ని మరొక సినిమాలోకి తీసుకురావడం హాలీవుడ్ సినిమాల్లోనే చూస్తుంటాం.కానీ F2 సక్సెస్ ఇచ్చిన జోష్ తో F3 కి ఈ ఫార్ములా వాడుతున్నాడు అనిల్ రావిపూడి.F3 టైటిల్ కి తగ్గట్టుగా F2 ని మించిన సక్సెస్ అందుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి.