పిఎం నరేంద్ర మోదీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను 23 భాషల్లో ….

PM Narendra Modi
PM Narendra Modi

భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవిత చరిత్రతో తెరకెక్కనున్న చిత్రం ‘పిఎం నరేంద్ర మోదీ’. దర్శకుడు ఒమంగ్ కుమార్ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, మోదీ పాత్రలో నటించనున్నాడు. సురేష్ ఒబెరాయ్ , సందీప్ సింగ్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం ఈనెల మూడవ వారంలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను 23 భాషల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేతుల మీదుగా ఈ రోజు లాంచ్ చేశారు.