వరుస హిట్లు కొట్టినా హ్యాపీగా లేని యంగ్ హీరో

VarunTej, Fidha, F2, SaiPallavi, Venkatesh, Hareshshankar, Credit,

వొక హీరో సినిమాలు వరుసగా విజయాలు సాధిస్తే ఆ హీరో క్రేజ్ రెట్టింపవుతుంది అది తెలుసు కదా  . వరుణ్ తేజ్ విషయంలో ఆలా కాలేదు. తాను నటించిన రెండు సినిమాలు ఫిదా , F2 50 కొట్ల వసూళ్లు రాబట్టినప్పటికి , ఫిదా క్రెడిట్ మొత్తం సాయి పల్లవి అని అలాగే F2 క్రెడిట్ వెంకటేష్ కొట్టేసాడు అని అంటున్నారు. వరుణ్ తేజ్ తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నప్పటికీ, తగినంత క్రేజ్ సంపాదించుకోలేక పోతున్నారు అంటున్నారు.

వరుణ్ తేజ్ అంతరిక్షం వొక ప్రయోగాత్మక చిత్రంగా ప్రశంసలు అందుకున్నాయి. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద విజయం లేదు. మరో చిత్రం తొలి ప్రేమ మంచి విజయాన్ని సాధించింది కానీ, 25 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లు లేవు. అందుకే ఇపుడు వరుణ్ తేజ్ సోలోగా హిట్ కొట్టడానికి చూస్తున్నాడు. ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో వొక సినిమా చేయబోతున్నాడు.