డబుల్ రోల్ లో నాని

Nani Dual Role in JERSEY
Nani Dual Role in JERSEY

నాచురల్ స్టార్ నాని నేచురాలిటీ పేరుతో రొటీన్ సినిమాలు చెయ్యడం మొదలు పెట్టాడు.దాంతో కృష్ణార్జున యుద్ధం అట్టర్ ప్లాప్ అయ్యింది.దాంతో రియాలిటీ లోకి వచ్చిన నాని వైవిధ్యమైన కథలు ఎంచుకుంటున్నాడు.జెర్సీ కూడా ఆ కోవకి సంబందించిన సినిమానే.ఈ సినిమాలో నాని క్రికెటర్ అవ్వాలనే మోటో తో పెరుగుతాడు.తెలుగు సినిమాల్లో ఇలాంటి క్యారెక్టర్ అరుదు.

ఇదే ఈ సినిమాలో స్పెషాలిటీ అనుకుంటే ఇప్పడు ఇంకో షాకింగ్ న్యూస్ కూడా వినిపిస్తుంది.అదేంటంటే ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నాడు.ఇంతకుముందు కూడా జెంటిల్ మ్యాన్,కృష్ణార్జున యుద్ధం సినిమాల్లో కూడా డ్యూయల్ క్యారెక్టర్ లో కనిపించాడు.అయితే ఈ సినిమాకి ఒక ప్రత్యేకత ఉంది.

ఈ సినిమాలో నాని తండ్రి,కొడుకు పాత్రల్లో కనిపించబోతున్నాడు.ఇది మాత్రం ఖచ్చితంగా కొత్తగా అనిపిస్తుంది.ఇక ఈ సినిమా ఎక్కువగా ఎమోషన్స్ మీద బేస్ అయిన సినిమా.సో,రెండు పాత్రలు నాని పోషిస్తున్నాడు కాబట్టి తన నటనతో పిండెయ్యడం,ఎమోషన్స్ ని పీక్స్ లో ప్రెజెంట్ చెయ్యడం ఖాయం.జెర్సీలో నాని ఏ రేంజ్ లో రెచ్చిపోయాడు అనేది ఏప్రిల్ 5 న తెలుస్తుంది.