నాగ చైతన్య టాప్ బ్యానర్ లో !

naga chaitanya
naga chaitanya

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో మజిలీ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే ఈ నెల మూడో వారం నుండి ‘వెంకీ మామ’ షూట్ లో పాల్గొనబోతున్నాడు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం చైతు మరో టాప్ బ్యానర్ లో మరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ లో చైతు సినిమా చేయబోతున్నాడు. డిసెంబర్ నుంచి ఈ సినిమా మొదలు కానుందని సమాచారం.

అలాగే చైతు కోసం స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఓ మంచి లవ్ స్టోరీ రాస్తున్నారు. పాత ‘దేవదాస్’ కథ ఆధారంగా అంతటి గొప్ప విషాదాంతమైన ప్రేమ కథను చైతు కోసం రాశాడట విజయేంద్ర ప్రసాద్. ఇక ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారో ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మధ్య వరుస ప్లాప్ లతో బాక్సాఫీస్ వద్ద కాస్త వెనుక పడిన చైతూకి శివ నిర్వాణ అన్నా ‘మజిలీ’తో మంచి హిట్ ఇస్తాడేమో చూడాలి.