పూరి,రామ్ ల సినిమాకు మణిశర్మ సంగీతం…!

Mani Sharma

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’.ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటివలే విడుదలయి మంచి ఆదరణ పొందింది.అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ విడుదల చేసింది చిత్ర యూనిట్.ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించనున్నారు. ఆరోసారి వీళ్ళిద్దరూ కలిసి పని చేయబోతున్నారు. గతంలో పూరీ జగన్నాథ్, మణిశర్మ కలిసి పని చేసిన ఐదు సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి.

ఈ ఇద్దరూ చివరగా టెంపర్ సినిమాకు కలిసి పనిచేశారు. ఆ చిత్రానికి నేపథ్య సంగీతం అందించారు మణిశర్మ. టెంపర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు రామ్ హీరోగా నటిస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు మణిశర్మ. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ జనవరి చివర్లో మొదలు కానుంది. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ నిర్మాణ సంస్థలపై దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.