రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవిత కథతో తెరకెక్కుతున్న సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. రాకేష్ రెడ్డి నిర్మాత. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి అడుగుపెట్టిన అనంతరం జరిగిన ఘటనలు ఈ చిత్రంలో చూపించానున్నాడు వర్మ. ఈ సినిమా ట్రైలర్ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా 14న విడుదల చేయబోతున్నారు.
ఇది కుటుంబ కుట్రల చిత్రం అంటూ సామాజిక మాధ్యమాలలో రామ్ గోపాల్ వర్మ చేస్తున్న పోస్టులు ఆసక్తి కలిగిస్తున్నాయి. రాజశేఖర్ అన్నిగి, యజ్ఞా శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కళ్యాణ్ కోడూరి సంగీతం అందిస్తున్నాడు. రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.