KGF రేర్ ఫీట్

KGF ..కన్నడ సినిమా చరిత్రలోనే హై బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ మాత్రమే కాదు ఇండియా వైడ్ గా సంచలన విజయం అందుకుంది.తెలుగులో పబ్లిసిటీ లేకపోయినా కూడా 15 కోట్లకు పైగా రాబట్టింది.హిందీ లో సైతం 50 కిట్ల క్లబ్ దిశగా దూసుకుపోతుంది.ఆ సినిమాలో తెలిసిన ముఖాలు ఒక్కటీ లేకపోయినా కూడా కంటెంట్ లో ఉన్న ఒరిజినాలిటీ,ఆ సినిమా టీమ్ మేకింగ్ లో పెట్టిన ఎఫర్ట్స్ మాత్రమే ఆ సినిమాకి అసాధారణ విజయం అందించాయి.

కర్ణాటకలో బాహుబలి-2 రికార్డ్ ని కూడా సునాయాసంగా దాటి ఇప్పటికే 140 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇంకా స్ట్రాంగ్ గా దూసుకుపోతుంది.ఈ సినిమా రన్ ఇంకా పూర్తికాలేదు.కన్నడలో చాలా చోట్ల,తెలుగులో కూడా కొన్ని చోట్ల ఇంకా రన్ అవుతుంది.అయితే ఈ సినిమాకి నార్త్ లో కూడా ఇంకా రన్ అవుతూ డీసెంట్ కలెక్షన్స్ రాబట్టడం మాత్రం నిజంగా గ్రేట్.అయితే ఇప్పటికే కన్నడలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా చరిత్ర సృష్టించిన KGF 250 క్లబ్ లోకి చేరడం కేవలం లాంఛనమే.

KGF చాప్టర్-2 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా సీక్వెల్ కాస్టింగ్ లిస్ట్ లో సంజయ్ దత్ కూడా జాయిన్ అవ్వడంతో అంచనాలు చుక్కలను తాకుతున్నాయి.ఇదే ఇంత సంచలనం సృష్టిస్తే సెకండ్ పార్ట్ ఇంకెంత సంచలనం రేపుతుందో అని మాట్లాడుకుంటున్నారు ట్రేడ్ అనలిస్ట్స్.