జనవరి 1న నాని ‘జెర్సీ’ చిత్రం నుంచి అప్డేట్…!

#jersey ,#Nani, @anirudhofficial, #jerseyfirstlook, @NameisNani ,@ShraddhaSrinath, @ShraddhaSrinath ,@anirudhofficial,

‘మల్లిరావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘జెర్సీ’.ఈ సినిమాలో అర్జున్ పాత్రలో కనిపించనున్నాడు. నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. క్రికెట్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం నాని క్రికెట్‌లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు అని సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబంధించి జనవరి 1న అప్‌డేట్ ఇవ్వనున్నట్లు చిత్రబృందం పోస్టర్‌ను విడుదల చేసింది.

అయితే చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్ రిలీజ్ చేస్తారో, టీజరే రిలీజ్ చేస్తారా అనే విషయం స్పష్టం చేయలేదు.ఈ చిత్రానికి అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.