కత్తులతో పొడుచుకున్న అ ఇద్దరి హీరోల అభిమానులు…!

peta

తమిళనాడులో స్టార్ హీరోల అభిమానుల నడుమ వివాదాలు చోటు చేసుకొవడం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా అజిత్, రజినీ, విజయ్ అభిమానుల నడుమ ఈ ఫ్యాన్ వార్ నడుస్తుంటుంది.కాగా ఈరోజు రజినీ ‘పేట’, అజిత్ ‘విశ్వాసం’ సినిమాలు విడుదలయ్యాయి. ఇంకేముంది ఫ్యాన్ వార్ మళ్ళీ మొదలైంది. పలుచోట్ల అభిమానుల మధ్య గొడవలు జరిగాయి. వేలూరులో అయితే ఏకంగా ఒకరినొకరు కత్తులతో పొడుచుకున్నారు. ఈ గొడవలో నలుగురికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది.