F2 ట్రైలర్ రివ్యూ: ఫన్ అండ్ ఫన్

f2

F2 …షూటింగ్ దశ నుండి ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.దానికి కారణం ఈ సినిమాకి కామెడీ ని పర్ఫెక్ట్ గా డీల్ చేసే అనిల్ రావిపూడి డైరెక్ట్ చెయ్యడం,అలానే కామెడీ ని పర్ఫెక్ట్ గా పండించే వెంకీ తో పాటు వరుణ్ తేజ్ కూడా ఈ సినిమాలో హీరోగా నటిస్తుండడం.అయితే ఈ సినిమా టీజర్ ఇది కామెడీ సినిమా అని కన్వే చేసింది తప్ప అంతకుమించి ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చెయ్యలేకపోయింది.దాంతో ఇప్పడు టీమ్ మరింత షార్ప్ గా కామెడీ ఎలివేట్ అయ్యేలా F2 ట్రైలర్ కట్ చేసారు.ట్రైలర్ ముందు నుండి చివరి వరకు వెంకీ కామెడీ టైమింగ్ హైలైట్ గా కనిపించింది.

పదేళ్ల క్రితం వెంకీ ఎలాంటి సినిమాలతో హిట్స్ అందుకున్నాడో మళ్ళీ అలాంటి టైమింగ్ కామెడీ నే వెంకీ తో చేయించాడు అనిల్ రావిపూడి.అయితే ఈ సినిమా అంతా కూడా సిట్యుయేషనల్ కామెడీ కావడంతో ట్రైలర్ కట్ చేయడం కష్టం అయ్యింది అని అర్ధమవుతుంది.ట్రైలర్ లో డైలాగ్స్ కంటే ఎక్కువగా మ్యానరిజమ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ నవ్వించాయి.కామెడీ పండించడంలో వరుణ్ తేజ్ బలహీనత కనిపించింది.ఇక వరుణ్ తేకంగానా యాస పలకడానికి కూడా కాస్త కష్టపడినట్టు కనిపించాడు.
మెహ్రీన్ అండ్ తమన్నాపోటీ పడి మరీ గ్లామర్ ఒలికించారు.వాళ్ళ ప్రెజెన్స్ సినిమాకి ప్లస్ అయ్యేలా కనిపిస్తుంది.

దేవి శ్రీ ప్రసాద్ ఆర్.ఆర్ కూడా ఆకట్టుకునేలా ఉంది.ఇక దిల్ రాజు ఈ సినిమాని చాలా రిచ్ గా,ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాడు.ఈ పండగకి ఇంటిల్లిపాది హాయిగా నవ్వుకుంటూ చూసే ఫ్యామిలీ మూవీ గా F2 ఉండబోతుంది అనే స్ట్రాంగ్ హింట్ ఇచ్చింది ట్రైలర్.పైగా ఈ సినిమాని సంక్రాంతి సీజన్ లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా శతమానం భవతి లానే శనివారం రిలీజ్ చేస్తున్నారు.అన్ని సెంటిమెంట్స్ కలిసొచ్చి ఈ సినిమా హిట్ అయితే ఆ బూస్ట్ తో నెక్స్ట్ సినిమాలు ప్లాన్ చేసుకుంటాడు దిల్ రాజు.