నేడు నిమ్మకూరులో విద్యాబాలన్ తో కలిసి బాలకృష్ణ పర్యటన…!

ntr kathanayakudu

‘ఎన్టీఆర్’ కథానాయకుడు చిత్రంలో ఎన్టీఆర్ సతిమని బసవతారకం పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ నటి విద్యాబాలన్ తో కలిసి,ఎన్టీఆర్‌ స్వగ్రామమైన నిమ్మకూరులో ఈ రోజు నందమూరి బాలకృష్ణ పర్యటించనున్నారు. ఈ మేరకు నిమ్మకూరులో ఏర్పాట్లు చేస్తున్నట్టు బాలకృష్ణ మిత్రుడు బుర్రా గాంధీ మీడియాకు తెలిపారు. బాలకృష్ణ, విద్యాబాలన్ తో పాటు కల్యాణ్ రామ్ కూడా రానున్నారని చెప్పారు.

అక్కడ ముందుగా ఎన్టీఆర్, బసవతారకంల విగ్రహాలకు పూలమాలలు వేశాక, ‘ఎన్టీఆర్’ రెండో భాగానికి సంబంధించిన ఓ సీన్ ను గ్రామంలో చిత్రీకరించనున్నారని చెప్పారు. హరికృష్ణగా నటిస్తున్న కల్యాణ్ రామ్ కూడా షూటింగ్ లో పాల్గొంటారని తెలిపారు. రేపు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకునే వీరు, ఆపై రోడ్డు మార్గంలో 10 గంటల సమయానికి నిమ్మకూరు చేరుకుంటారని వెల్లడించారు.