సినిమా అంటేనే రిస్క్ అంటున్న విజయ్ దేవరకొండ…!

Vijay Devarakonda

భరత్‌ కమ్మ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. ‘ఫైట్‌ ఫర్‌ వాట్‌ యు లవ్‌’ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రాని కాకినాడ షెడ్యూల్‌ ఇటివలే పూర్తి చేసుకుంది. నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, మోహన్‌ చెరుకూరి, యశ్‌ రంగినేనిఈ సినిమాను నిర్మిస్తున్నారు.

కాగా సినిమా షూటింగ్ ఫినిష్ అయిన అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న విజయ్ దేవరకొండ ఇటీవల సినిమా షూటింగ్‌లో భాగంగా రైల్వేస్టేషన్‌లో తనకు జరిగిన ప్రమాదంపై స్పందించారు. సినిమాల్లో కొన్ని సన్నివేశాలు సహజంగా ఉండాలంటే రిస్క్ తప్పదని పేర్కొన్నాడు. షూటింగ్‌కి కాకినాడ ప్రజలు బాగా సహకరించారని, ఇక్కడునన్ని రోజులు సముద్రం చూస్తూ చాలా ఎంజాయ్‌ చేశానని చెప్పారు. ఈ చిత్రం 2019 మే నెలలో విడుదలకు సిద్ధమవుతోంది.