సప్తగిరి హీరోగా ‘వజ్ర కవచధర గోవింద’

Sapthagiri , VajraKavachadharaGovinda , SAPTAGIRIEXPRESS, SAPTAGITILLB, COMMEDY, SIVASIVAMFILMS, GVNREDDY,
Sapthagiri , VajraKavachadharaGovinda , SAPTAGIRIEXPRESS, SAPTAGITILLB, COMMEDY, SIVASIVAMFILMS, GVNREDDY,

స్టార్ కమెడియన్‌గా రాణిస్తూ ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’, ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బీ’ చిత్రాల లో తనకంటూ ఓ రూట్‌ని ఏర్పరుచుకున్నారు హీరో సప్తగిరి. సప్తగిరి హీరోగా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ తెరకెక్కించిన దర్శకుడు అరుణ్ పవార్ డైరెక్షన్‌లో శివ శివమ్ ఫిలింస్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి ఓ చిత్రాన్నినిర్మిస్తున్నారు.ఈ చిత్రం కు ‘వజ్ర కవచధర గోవింద’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

దర్శకుడు అరుణ్ పవార్ మాట్లాడుతూ.. ”ఈ కథకు కరెక్ట్ టైటిల్ . ఇందులో సప్తగిరి ఫన్నీ దొంగ. ఇతనికో లక్ష్యం ఉంది. ఆ లక్ష్య సాధన కోసం అతనేం చేశాడన్నదే ఈ చిత్రం. కడుపుబ్బా నవ్వించే అంశాలతోపాటు, యాక్షన్, ఎమోషన్, ఇతర వాణిజ్య అంశాలు ఇమిడి ఉన్నాయి. సప్తగిరి బాడీ లాంగ్వేజ్‌కి పర్‌ఫెక్ట్‌గా సూటయ్యే కథ ఇది” అని తెలిపారు

వైభవీ జోషీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అర్చనా వేద, రాజేంద్ర జాన్ కొట్టోలి, టెంపర్ వంశీ, అప్పారావు, అవినాష్ వీరేన్ తంబిదొరై తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు .
వజ్ర కవచధర గోవింద చిత్రాని లో
సంగీతం: విజయ్ బుల్గానిన్.
కెమెరా: ప్రవీణ్ వనమాలి.
ఎడిటింగ్: కిషోర్ మద్దాలి.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సాలన బాలగోపాలరావు తదితరులు ఉన్నారు