టిడిపికి గుడ్ బై చెప్పి వైసిపిలో చేరిన మోదుగుల

Modugula Venugopala Reddy joined YSRCP
Modugula Venugopala Reddy joined YSRCP

తెలుగుదేశం పార్టీలో ద్వితీయ శ్రేణి పౌరుడిగా ఉండలేకే ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన‌ట్లు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన నాయకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి వెల్ల‌డించారు. వైసిపి అధినేత జగన్ సమక్షంలో ఆయన వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీ కండువా వేసి మోదుగుల‌ను ఆహ్వానించారు. అనంత‌రం మోదుగుల వేణుగోపాలరెడ్డి మీడియాతో మాట్లాడారు. గుంటూరు జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని అన్నారు . జగన్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు సైనికుడిలా పనిచేస్తానని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లాలో టీడీపీకి స్థానం లేకుండా చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తామన్నారు. తనకు వైఎస్‌ జగన్‌ ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేస్తానని అన్నారు. ఏపీ అభివృద్ధి వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి తదితరులు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.