మ‌మ‌త మ‌ద్ద‌తు కోరిన మోదీ

PM Narendra Modi
PM Narendra Modi

ప‌శ్చిమ బెంగాల్‌లో ప‌ర్య‌టిస్తోన్న ప్ర‌ధాని మోదీ ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి , తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ మ‌ద్ద‌తు కోరారు.ప‌శ్చిమ బెంగాల్‌లో టూర్ లో వున్న ఆయ‌న థాకూర్ న‌గ‌ర్‌లో బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్నారు. త‌మ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన పౌర‌స‌త్వ బిల్లును ఆయ‌న ప్ర‌శంసించారు. ఆ బిల్లుకు రాజ్య‌స‌భ‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తు తెలిపాల‌ని మోదీ కోరారు.

అయితే బిల్లుకు మ‌ద్ద‌తు ఇచ్చి పార్ల‌మెంట్‌లో పాస్ అయ్యేలా చూడాల‌ని మోదీ తృణ‌మూల్ పార్టీని కోరారు. కేంద్ర బ‌డ్జెట్‌పైన కూడా ఆయ‌న మాట్లాడుతూ… లోక్‌స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత యువ‌త‌, రైతులు, ఇత‌ర వ‌ర్గాల‌కు మ‌రిన్ని వ‌రాలు ఉంటాయ‌న్నారు. మ‌మ‌తా బెన‌ర్జీ పాల‌న‌లో గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌లు క‌ష్టాలు ఎదుర్కొన్నార‌ని ఆరోపించారు.