నేను ఓడిపోవడమే అజెండాగా పెట్టుకొని కొందరు ఏకమవుతున్నారు:మోడీ

PM Narendra Modi
PM Narendra Modi

జాతీయ స్థాయిలో బీజేపీ ని ఎదుర్కొనేందుకు కుట్రలు జరుగుతున్నాయి. అందరు కలిసి కూటముల పేరుతొ దాడికి దిగుతున్నారు. మహాకూటమి, ఫెడరల్‌ ఫ్రంట్‌ల ఏర్పాటు ప్రయత్నాలను ప్రధాని మోడీ తోసిపుచ్చారు. నేను ఓడిపోవడమే అజెండాగా పెట్టుకొని అందరు ఏకమవుతున్నారు. అలా ఏకమవడాన్ని ప్రజలు తిప్పికొడతారని అన్నారు. ఎంతో ఎత్తుగడలతో ముందుకెళ్లిన మహాకూటమి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విఫలమైందని అన్నారు.

తెలంగాణా ఎన్నికల్లో కూటమి పేరు చెప్పి వచ్చిన చంద్రబాబు కి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. సిద్ధాంతాలను పక్కనపెట్టి చంద్రబాబు కాంగ్రెస్‌ పక్కన చేరారని మండిపడ్డారు. కెసిఆర్ కి మోడీ సపోర్ట్ గ ఉన్నారనే చంద్రబాబు మాటలను తిప్పి కొట్టారు. మోడీ సహాయం తోనే కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారని చంద్రబాబు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండి పడ్డాడు. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు పూనుకున్నారన్న విషయం తనకు తెలియదని మోదీ తెలిపారు.