మోదీ పిరికిపంద అంటూ రాహుల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Modi is a 'darpok' person
Modi is a 'darpok' person

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి ఫైర‌య్యారు. జాతీయ భద్రత, రాఫెల్‌ జెట్‌ ఫైటర్ల ఒప్పందంపై దమ్ముంటే ఐదు నిముషాలు తనతో చర్చకు రావాలంటూ సవాల్‌ విసిరారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ మైనార్టీ విభాగం సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు. బీజేపీని, మోడీని బహిరంగ వేదికపై చర్చకు రావాలని ఛాలెంజ్‌ చేస్తున్నా… కానీ ఆయన భయపడుతున్నారు.

ఆయన ధైర్యం లేని వ్యక్తి. ఐదేళ్లు ప్రధానిపై పోరాటం చేసిన తర్వాత నాకిప్పుడు ఈ విషయం తెలిసింది అని రాహుల్ వ్యాఖ్యానించారు. రాఫెల్‌ డీల్‌పై చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు. కాపలాదారే దొంగ అంటూ ప్రధానమంత్రిపై నేరుగా ఎదురు దాడికి దిగిన రాహుల్, మోదీ పిరికిపంద అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ద‌మ్ముంటే త‌న‌తో బ‌హిరంగ చ‌ర్చ‌కు రావాల‌ని స‌వాల్ చేశారు రాహుల్‌.