ప్ర‌శాంతంగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్

Telangana Elections
Telangana Elections

తెలంగాణ‌లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించారు. మూడు నియోజకవర్గాల్లో 9 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే ఎన్నికల బరిలో నిలవగా, వరంగల్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మాత్ర టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలతో పాటు ముగ్గురు స్వతంత్రులు బరిలో నిలిచారు. మూడు ఎమ్మెల్సీ నియోజకవర్గాల పరిధిలో 2,799 మంది ఓటర్లు ఉన్నారు. జూన్ 3వ తేదీన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది.