పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా దావోస్ టూర్ కు మంత్రి లోకేష్

Nara Lokesh,WEF annual meeting,Davos,Switzerland, Andhra pradesh
Nara Lokesh,WEF annual meeting,Davos,Switzerland, Andhra pradesh

ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి లోకేష్‌ దావోస్‌ వెళ్లనున్నారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి బయలుదేరనున్న ఏపీ ప్రత్యేక ప్రతినిధుల బృందానికి మంత్రి లోకేష్‌ నాయకత్వం వహించనున్నారు.

ఏపీకి మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చే లక్ష్యంతో ఈపర్యటన సాగనుంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం వార్షిక సమావేశాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత సంపన్న, శక్తివంతమైన దేశాలకు చెందిన ప్రభుత్వ నేతలు, పెట్టుబడిదారులు, వాణిజ్యవేత్తలు, ప్రఖ్యాత కంపెనీల నిర్వాహకులు, ఆర్ధికవేత్తల పరస్పర ఆలోచనలు పంచుకోనున్నారు. వివిధ దేశాల నుంచి వందకు పైగా ప్రభుత్వాల ప్రతినిధులు, ప్రపంచ నలుమూలల నుంచి వెయ్యికి పైగా ప్రముఖ కంపెనీల ప్రతినిధులు దావోస్‌ సదస్సుకు హాజరు కానున్నారు.

మంత్రి లోకేష్‌ నేతృత్వంలోని ఏపీ ప్రతేక ప్రతినిధి బృందం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో ఉన్న అనువైన పరిస్ధితు లను వివరించి వారిని ఒప్పించి రప్పించేందుకు ఈ ప్రపంచ ఆర్ధిక వేదిక కేంద్రంగా కృషిచేయ నున్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్లో మొదటిస్థానంలో నిలిచిన ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలు, ఇస్తున్న రాయితీలు ఆయా కంపెనీల ప్రతినిధులకు మంత్రి లోకేష్‌ సమగ్రంగా వివరించనున్నారు.