జగన్తో కేటీఆర్ బృందం భేటీ

Jagan Meet KTR Creates Political Heat in Andhra Pradesh
Jagan Meet KTR Creates Political Heat in Andhra Pradesh

ఆంద్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ఎన్నిక‌ల‌కు ముందే హీట్ పెంచుతున్నాయి.  ఫెడరల్‌ ఫ్రంట్ పేరుతో  వైసిపి , టి ఆర్ ఎస్  మధ్య చర్చలు జ‌రిగాయి. కాంగ్రెస్‌, బిజేపి లకు వ్యతిరేకంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు తెలంగాణ  సిఎం  కేసీఆర్‌ శ్రీకారం చుట్టిన విష‌యం తెలిసిందే.  ఫ్రంట్‌ ఏర్పాటుపై ఇప్పటికే పశ్చిమ‌ బంగా సీఎం మమతా బెనర్జీ,  ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌,  యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో కేసీఆర్‌ చర్చలు జరిపారు.

దీనిలో భాగంగానే  ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ తో  టిఆర్ ఎస్ నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో వైసిపి , టిఆర్ ఎస్ నేతల భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది.   ఫెడరల్‌ ఫ్రంట్‌తో కలిసి వచ్చే విషయంపై వైసిపితో చర్చలు జరపాలని తెలంగాణ సిఎం  కేసీఆర్‌ నిర్ణయించారు .  కేసీఆర్‌ ఆదేశాల మేరకు   టి ఆర్ ఎస్ నేతలు కేటీఆర్‌, వినోద్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రావణ్ కుమార్‌రెడ్డి తదితరులు  లోటస్ పాండ్‌లోని జగన్‌ నివాసానికి చేరుకుని చర్చలు జ‌రిపారు.  తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ విజయం సాధించిన తర్వాత,  ఏపీ సీఎం చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ చర్చల్లో భాగంగా జగన్‌తో చర్చలు సాగించ‌డం  ఆసక్తికరంగా మారింది.

రాజకీయంగా కేటీఆర్ తొలిసారి ఏపీ ప్రతిపక్ష నేత జగన్ తో  భేటీ కావ‌డం  ప్రాధాన్యత సంతరించుకుంది.