మేఘా కి ఇప్పుడయినా కలిసొస్తుందా?

Megha Akash
Megha Akash

మేఘా ఆకాష్ కి లక్కు ఎక్కువే…కానీ ఎక్కడో అదృష్టం మాత్రం ఎప్పుడూ ఆమడ దూరంలో ఉంటుంది.ఫ్రెండ్స్ తో కాఫీ తాగడానికి వెళ్లి అక్కడ గౌతమ్ మీనన్ కంట పడడంతో ఏకంగా ధనుష్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికయింది.పాపం కాలం కలసిరాక ఆ సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు.తెలుగులో నితిన్ తో కలసి లై అనే భారీ బడ్జెట్ సినిమా చేసింది.ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయినా మళ్ళీ నితిన్ తోనే ఛల్ మోహన రంగ సినిమా చేసింది.కానీ రిజల్ట్ మాత్రం సేమ్.దాంతో తెలుగులో చెయ్యడానికి ఏమీ లేక తమిళ్ లో వచ్చిన సినిమాలే చేస్తుంది.ఇప్పడు దిల్ రాజు బ్యానర్ లో రాజ్ తరుణ్ సినిమాలో మేఘా ఆకాష్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది.కాకపోతే ఈ సారి ఆమె లక్ ఎంత అనేది ఇంకా ముందే తేలిపోనుంది.

ఈ సినిమా ఒక షెడ్యూల్ అయ్యాక దిల్ రాజు అవుట్ ఫుట్ చూసి ఓకే అంటేనే సినిమాని ఫుల్ ప్లెడ్జెడ్ గా ;లాక్ చేస్తారు అనే కండిషన్ ఉండనే ఉంది.ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా కూడా నిజం.లవర్ సినిమా రిజల్ట్ తో ఈ డెసిషన్ తీసుకున్నారు రాజు గారు.మరి ఈ సారయినా ఈ సినిమాతో హిట్ కొడితే ఓకే,లేదంటే మాత్రం మేఘా తెలుగు వరకు టోటల్ ప్యాక్ అప్.