సైరా కి మెగా జోడింపులు

Syeraa Narsimha Reddy
Syeraa Narsimha Reddy

ఎప్పుడో రెడీ అయిన సైరా స్క్రిప్ట్ నేటి ట్రెండ్ కి తగినట్టుగా మార్చుకుని,గ్రాఫికల్ వర్క్ కి సపోర్ట్ గాఉండేలా తీర్చి దిద్దడానికి బాగానే టైం తీసుకున్నారు.అయినా కూడా ఈ సినిమాకి ఎప్పటికప్పడు మార్పులు చేర్పులు జరుగుతున్నాయికొత్త కొత్త పాత్రలు క్రియేట్ చేసి పేరున్న నటీనటములను తీసుకువస్తున్నారు.సినీమాకి ప్రధాన ఆకర్షణగా చిరు ఉన్నా కూడా భారీ ప్రాజెక్ట్ కాబట్టి సునాయాసంగా సేఫ్ అవ్వాలి అంటే ఇంకా కొన్ని మెరుగులు తప్పవు.

అందుకే ఈ సినిమాలో మరో కీలక పాత్ర సృష్టించారు.అయితే ఆ పాత్రలో ఎవరు నటిస్తారు అనేది క్లారిటీ లేదు అంటున్నారు.నిజానికి దాన్ని అఫీషియల్ గా ప్రకటించకపోయినా కూడా ఆ పాత్ర డిజైన్ చేసింది బన్నీ కోసమే.బన్నీ సైరా లో నటిస్తున్నాడు అనేది ఎప్పటినుడి వినిపిస్తున్న మాట.పైగా సైరా ని తమిళ్.కన్నడ,హిందీ భాషల్లో మార్కెట్ చెయ్యడానికి వీలుగా అక్కడ బాగా క్రేజ్ ఉన్నా వాళ్ళను తీసుకున్నారు.కానీ మళయాళంనుండి మాత్రం ఎవరిని తీసుకోలేదు.

బన్నీ కి మలయాళంలో భారీ ఫాన్స్ బేస్ ఉంది.ఇక్కడ ఫ్లాప్ అయిన సినీమాలు కూడా అక్కడ హిట్ అయిపోతుంటాయి.అలాంటి బన్నీ ని సైరా లోకి తీసుకుంటే తెలుగుతో పాటు మలయాళం వెర్షన్ కి కూడా బెనిఫిట్ ఉంటుంది.అందుకే బన్నీ తీసుకోబోతున్నారు.లాస్ట్ షెడ్యూల్ లో బన్నీ ఎపిసోడ్స్ షూట్ చేసే అవకాశం ఉంది.