అర్జున్ సురవరంకి భారీ హైప్

Arjun Suravaram
Arjun Suravaram

ఈ మధ్య సాలిడ్ కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ మంచి హిట్స్ అందుకుంటున్న నితిన్ ఇప్పుడు కనితన్ అనే తమిళ్ బ్లాక్ బస్టర్ ని రీమేక్ చేస్తున్నాడు.ముందు ఈ సినిమాకి ముద్ర అనే టైటిల్ పెట్టి చాలా వరకు షూటింగ్ కూడా చేసారు.కానీ అనుకోని కాంట్రవర్సిలతో ఆ సినిమాలో హీరో పేరు అయిన అర్జున్ సురవరం ని సినిమా టైటిల్ గా ఫిక్స్ చేసారు.ఈ సినిమాకి అందరి నుండి చాలా పాజిటివ్ అప్లాజ్ వస్తుంది.మెగాస్టార్ సైతం ఆ ప్రోమోచూసి ప్రొడ్యూసర్ కి మెసేజ్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది.

తమిళ్ లో అవుట్ అండ్ అవుట్ థ్రిల్లర్ మోడ్ లో ఉన్న ఈ సినిమాకి ఇక్కడ కాస్త యాక్షన్ టోన్ కూడా వచ్చేలా తీశారు.నిఖిల్ బాడీ లాంగ్వేజ్ కూడా చాలావరకు మారింది.టీజర్ వరకు,మెయిన్ ప్లాట్ వరకు రంగం సినిమా ఛాయలు ఉన్నా కంటెంట్ మాత్రం చాల రేసీగా సాగుతుంది.స్క్రీన్ ప్లే సినిమాకి హైలైట్.ఇక్కడ కూడా పెద్దగా మార్పులు లేకుండానే తీసాం అని చెబుతున్నారు.అందుకు తగ్గట్టుగానే టీజర్ చాలా గ్రిప్పింగ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది.

హీరో ని కార్నర్ చేసే థ్రిల్లర్ ఫార్ములా అనేది ఎప్పుడూ కూడా హిట్ ఫార్ములానే కాబట్టి అర్జున్ సురవరం కూడా అదే ఫార్ములాని పక్కాగా ఫాలో అవుతుంది.నిఖిల్ సరసన లావణ్య కూడా బాగానే సెట్ అయ్యింది.అలాగే సినిమా విజువల్స్ కూడా క్వాలిటీ గానే ఉన్నాయి.

నిఖిల్ సినిమాలకు ఉన్న సాలిడ్ ఫ్యాన్స్ బేస్ కి ఈ సినిమా బాగా నచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.పైగా ఈ సంవత్సరం ఇప్పటివరకు ఒక్క F2 తప్ప అన్ని ఏజ్ గ్రూప్స్ ని,అన్ని వర్గాల ప్రేక్షకులని శాటిస్ఫాయ్ చేసే సినిమా ఏదీ రాలేదు.సో,ఆ లోటు తీరుస్తూ నిఖిల్ కి మరో భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చే సినిమాగా అర్జున్ సురవరం నిలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.