మెగా ,నందమూరి హీరోల బాక్స్ఆఫీస్ వార్

Allu-Sirish,Kalyan-Ram
Allu-Sirish,Kalyan-Ram

బాక్స్ ఆఫీస్ దగ్గర అపుడప్పుడు కొన్ని సినిమాలు పోటీ పడడం అనేది కామన్అయితే మెగా, నందమూరి హీరోల మధ్య పోరు మాత్రం ఎప్పుడూ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది.ఈ సారి కూడా మెగా కాంపౌండ్ హీరో అయిన అల్లు శిరీష్ అండ్ నందమూరి హీరో అయిన కళ్యాణ్ రామ్ సినిమాల మధ్య క్లాష్ ఏర్పడింది.కళ్యాణ్ రామ్ నటించిన 118 అనే సినిమా థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతుంది.టైటిల్ లోగో డిజైన్ తోనే ఈ థ్రిల్లర్ మూవీ కి బోలెడంత బజ్ వచ్చింది.

ఫేమస్ అండ్ ట్యాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ అయిన గుహన్ ఈ సినిమాతో డైరెక్టర్ గా మారుతుండడం విశేషం.కథని నమ్ముకుని చేస్తున్న సినిమా కావడంతో ఇది ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అనే నమ్మకంగా ఉన్నారు యూనిట్.హాలిడే సీజన్,శివరాత్రి పండుగ అడ్వాంటేజ్ కూడా కలిసి వస్తుంది అని ఈ సినిమాని మార్చ్ 1 న రిలీజ్ చేస్తున్నట్టు డేట్ ఇచ్చారు.శ్రీరస్తు-శుభమస్తు లాంటి హిట్ సినిమా తరువాత ఒక్క క్షణం అనే డిఫరెంట్ సినిమా చేసినా కూడా హిట్ అందుకోలేకపోయిన అల్లు శిరీష్ ప్రస్తుతం ABCD అనే సినిమా చేస్తున్నాడు.

అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ అనే మలయాళ బ్లాక్ బస్టర్ ని టైటిల్ కూడా మార్చకుండా ఉన్నది ఉన్నట్టుగా రీమేక్ చేస్తున్నారు.ఇది కూడా స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమా.ఇక ఈ సినిమా మోషన్ పోస్టర్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చెయ్యడం,సురేష్ ప్రొడక్షన్స్,మధుర ఎంటర్టైన్మెంట్ లాంటి ప్రెస్టీజియస్ బ్యానర్స్ నిర్మిస్తున్న సినిమా కావడంతో అంచనాలు బావున్నాయి.ఇది కూడా మార్చ్ 1 నే రిలీజ్ అవుతుంది.ఈ రెండు సినిమాలు కూడా ఇద్దరు హీరోలకు చాలా కీలకం.అయితే ఈ రేస్ నుండి 118 డ్రాప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఎందుకంటే కల్యాణ రామ్ నటించిన,బాలయ్య నిర్మించిన ఎన్టీఆర్ మహానాయకుడు కూడా ఫిబ్రవరి 28 న గాని,మార్చ్ 1 న గాని రిలీజ్ చెయ్యడానికి బాలయ్య ముహూర్తం ఖరారు చేసాడు.కథానాయకుడు సరిగ్గా ఆడకపోవడంతో మహానాయకుడు హిట్ కంపల్సరీగా మారింది.మహానాయకుడు సినిమాలో కళ్యాణ్ రామ్ పాత్ర కీలకంగా ఉండబోతుంది.దీంతో 118 మార్చ్ మూడో వారానికి వెళ్లే అవకాశాలున్నాయి.ఒక వేళ కళ్యాణ్ రామ్ డ్రాప్ అయినా కూడా మహానాయకుడు,ABCD సినిమాల మధ్య క్లాష్ తప్పదు.