దటీజ్ తేజు అంటున్న మెగా ఫాన్స్ …!

Sai-Dharam-Tej
Sai-Dharam-Tej

కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్నసినిమా ‘చిత్రలహరి’. ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్‌, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని ఓ ప్రముఖ స్టూడియోలో వేసిన సెట్ లో జరుగుతోంది. ఈ సందర్భంగా తేజును చూడటానికి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సాయి వెంటనే ఫ్యాన్స్ వద్దకు వెళ్లి వారిని పలకరించాడు.

వారితో సెల్ఫీలు దిగాడు. అనంతరం వారిలో చాలా మంది దూర ప్రాంతాల నుంచి వచ్చినట్లు తెలుసుకుని భోజనాలు పెట్టించాడట. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో మెగా అభిమానులు దటీజ్ తేజూ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.కాగా ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ నిర్మిస్తుంది.