అప్పుడు బాబాయ్…ఇప్పడు అబ్బాయ్

pawan kalyan,ram charan

తెలుగు సినిమాలకి బిగ్గెస్ట్ సీజన్ సంక్రాంతి.అందుకే జనరల్ గా భారీ బడ్జెట్ సినిమాలు ఈ సీజన్ కే తీసుకొస్తుంటారు.అయితే గత సంవత్సరం భారీ అంచనాలనడుమ,షేర్ హిట్ అనే సంకేతాలిస్తు థియేటర్స్ లోకి వచ్చిన అజ్ఞాతవాసి కనీసం ఫ్యాన్స్ ని కూడా అలరించలేకపోయింది.దారుణమైన డిజాస్టర్ గా మిగిలింది.100 కోట్లకు పైగా ఆ సినిమా హక్కులు అమ్మడంతో సినిమా కొనుకున్నవాళ్లంతా కూడా దారుణంగా నష్టపోయారు.దాంతో తమ బ్యానర్ రెప్యుటేషన్ కాపాడుకోవడానికి ఆ సినిమా నిర్మాత కొంత డబ్బు రిటర్న్ ఇవ్వడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.ఈ సంవత్సరం సంక్రాంతికి సేమ్ సీన్ మళ్ళీ రిపీట్ అయ్యింది.

అయితే అజ్ఞాతవాసి లో హీరో పవన్ కళ్యాణ్ అయితే వినయ విధేయ రామ లో హీరో లో రామ్ చరణ్ కావడం విశేషం.ఈ సినిమా కూడా బడ్జెట్ అదుపుతప్పడంతో చాలా ఎక్కువ ఖర్చు అయ్యింది.అందుకే థియేటర్ రైట్స్ కి 90 కోట్లకు పైగానే డిమాండ్ చేసారు.అదే రేటుకి కూడా అమ్మారు.అయితే VVR కొనుకున్న బయ్యర్స్ కి కూడా చుక్కలు కనిపించాయి.అసలు ఫెయిల్యూర్ అన్నదే ఎరుగని యూవీ క్రీటిన్స్ కి భారీ ఝలక్ తగిలిగింది.ఓవర్సీస్ బయ్యర్ పరిస్థితి మరీ దారుణం.అందుకే నిర్మాత దానయ్య కొంత డబ్బు వెనక్కి తిరిగి ఇస్తున్నాడు.గత సంవత్సరం,ఈ సంవత్సరం కూడా మెగా ఫ్యామిలీ హీరోలు ఫ్లాప్స్ అందుకోవడంతో ఈ పండక్కి వాళ్ళ సినిమాలు రిలీజ్ చేస్తే కలిసిరాదు అనే సెంటిమెంట్ బలపడడం విశేషం.