కళ్యాణ్ దేవ్ సరసన ‘తూనీగా తూనీగా’ హీరోయిన్…!

Rhea Chakraborty

“విజేత” సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్. కళ్యాణ్ దేవ్ తన తదుపరి సినిమాని పులి వాసు దర్శకత్వంలో చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ సరసన బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తి ని హీరోయిన్ గా ఫైనలైజ్ చేశారని సమాచారం.హిందీలో “హాఫ్ గర్ల్ ‘ఫ్రెండ్” “బ్యాంక్ చోర్” ‘జలేబి’ లాంటి సినిమాలో నటించింది రియా. అలాగే ఈ హీరోయిన్ తెలుగులో ‘తూనీగా తూనీగా’ అనే సినిమాలో నటించింది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ పై ఈ సినిమా తెరకెక్కనుంది.ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి నుంచిమొదలు కానుంది.