మజిలీ లో మాస్ యాంగిల్

Majili
Majili

సమంత,నాగ చైతన్య జంటగా నటిస్తున్న మజిలీ ఉగాది సందర్భంగా రిలీజ్ అవుతుంది అనే విషయం కన్ఫర్మ్ అయ్యింది.ఈ సినిమాలో పెళ్లయిన తరువాత చైతు,సమంత కలిసి నటిస్తుండడంతో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా డైరెక్టర్ శివ నిర్వాణ తన తొలి సినిమా నిన్నుకోరి ఛాయల్లోనే ఈ సినిమాని కూడా తెరకెక్కిస్తున్నాడు.అయితే అందుకో బ్రేక్ అప్ తరువాత హీరోయిన్ పెళ్లి చేసుకుని పెయిన్ ఫీల్ అవుతుంటే ఇక్కడ అదే పెయిన్ అండ్ ఫీల్ హీరో పాత్రకి ఆపాదించారు.రీసెంట్ గా రిలీజ్ చేసిన వన్ బాయ్ వన్ గర్ల్ లిరికల్ వీడియో కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తుంది. కథ పరముగా పెద్దగా ట్విస్టులు,కొత్తదనం వంటి అంశాల జోకిలి పోకుండా అందరికి తెలిసిన కథనే లైవ్లీ అండ్ ఫీల్ ఓరియెంటెడ్ స్క్రీన్ ప్లే లో చెప్పే ప్రయత్నం చేస్తుంది మజిలీ టీమ్.అయితే గోపిసుందర్ అందించిన ఈ పాత ట్యూన్ భలే భలే మగాడివివోయ్ ని గుర్తుచేస్తున్నా కూడా పదాల మ్యాజిక్ బాగా వర్క్ అవుట్ అయ్యేలా కనిపిస్తుంది.ఓవర్ ఆల్ గా చెప్పాలంటే ఈ సమ్మర్ లో కూల్ బ్రీజ్ లాంటి లవ్ స్టోరీ ని,ఎమోషనల్ అటాచ్మెంట్ ని కలిపి కాంబో గా అందించబోతుంది మజిలీ.