సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ కు సుప్రీం షాక్ ..!

M Nageswar Rao
M Nageswar Rao

సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ ఎం నాగేశ్వర్‌రావుకు అరుదైన శిక్ష విధించింది సుప్రీంకోర్టు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఆయ‌న‌ను చివాట్లు పెట్టింది. బీహార్ షెల్టర్ హోమ్ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారిని కోర్టు అనుమ‌తి లేకుండా బదిలీ చేయడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన క్షమాపణను తిరస్కరించింది. రోజంతా కోర్టులో ఒక మూలన కూర్చోవాలని, రూ.లక్ష జరిమానా కట్టాలని ఆదేశిస్తూ అరుదైన తీర్పు నిచ్చింది.

ఎవరినీ బదిలీ చేయరాదని, విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదని స్వయంగా తాము హెచ్చరించినా, ఆయన పెడచెవిన పెట్టారని గుర్తు చేసింది సుప్రీంకోర్టు. నాగేశ్వరరావుతో పాటు సీబీఐ డైరెక్టర్‌ ప్రాసిక్యూషన్‌ బాసూరాం కూడా దోషేనని ఆయనకూ జరిమానా విధించింది. వీరు చేసినది పొరపాటు కాదని, ఉద్దేశపూర్వకమైన చర్యంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ పేర్కొన్నారు.