ముందే వచ్చేస్తున్న మన్మథుడు

Manmadhudu 2
Manmadhudu 2

మన్మధుడు-2 సినిమా పోర్చుగల్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.ఆ సింగల్ షెడ్యూల్ లోనే ఆల్మోస్ట్ మొత్తం సినిమా పూర్తయిపోతుంది.ఒక హాలీవుడ్ మూవీ కి అఫిషియల్ రీమేక్ గా ఈ సినిమా రూపొందుతుంది అని అంటున్నారు.అందుకే ఈ సినిమా కథపై నాగ్ అంత నమ్మకం పెట్టుకుని రాహుల్ రవీంద్రన్ కి ఫుల్ ఫ్రీ డమ్ ఇచ్చి,భారీ బడ్జెట్ కూడా కేటాయించారు.నాగ్ కి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా,సమంత,కీర్తి సురేష్ కూడా కాస్త లెంగ్త్ ఉన్న ఇంపార్టెంట్ పాత్రల్లో నటిస్తున్నారు.అయితే ఈ సినిమాను ముందుగా దసరా కి రిలీజ్ చేద్దామని అనుకున్నారు.కానీ అదే టైం కి సైరా షెడ్యూల్ అవడంతో ఈ సినిమాను వెనక్కు తీసుకెళితే సంక్రాంతికి వచ్చే బంగార్రాజు పై ఎఫెక్ట్ పడొచ్చు.అందుకే మన్మథుడు-2 ను ముందుకు తెస్తున్నారు.అయితే ఆగష్టు లో సాహో కూడా ఉంది.అది కూడా భారీ బడ్జెట్ సినిమా.అందుకే క్రిస్పీ రన్ టైం తో,హిలేరియస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని జులై లాస్ట్ వీక్ లో రిలీజ్ చెయ్యడం అనే ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నారు.ప్రొడ్యూసర్ గా నాగార్జున ఎంత ముందు చూపుతో ఆలోచిస్తాడు అనేదానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు.