ఏపికి ప్రత్యేక హోదా ఫై హీరో మంచు మనోజ్ స్పందన…!

manchu-manoj
manchu-manoj

సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలలో మంచు మనోజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. కేవలం సినిమా విషయాలనే కాక రాజకీయం, సామాజిక సమస్యలపై కూడా తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటాడు. అయితే తాజాగా తన ట్విట్టర్ లో భారత ప్రధానమంత్రిని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశాడు మనోజ్‌. పీఎం నరేంద్రమోదీ, ఇంతకాలం మీరు చేస్తున్న యుద్ధంలో మేమంతా మీతో ఉన్నాం.

మాకిచ్చిన వాగ్ధానాలని నెరవేరుస్తారని, ఇన్ని రోజులు మిమ్మల్నే సపోర్ట్ చేస్తూ వచ్చాం. అయితే స్పెషల్ స్టేటస్ కాదు కదా, మీ దగ్గర నుండి కనీసం కృతజ్ఞతా భావం కూడా రాలేదు. ఇప్పటికైనా మా డిమాండ్‌ని గౌరవించి మా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే మీరు ఎవరి సన్నిధిలో ప్రమాణంలో చేశారో, వారి ఆగ్రహానికి గురికాక తప్పదు అంటూ ఘాటైన ట్వీట్ చేశాడు మనోజ్‌.