మళ్ళీ అక్కినేని హీరోల ‘మనం-2’

Manam
Manam

గతంలో మనం సినిమాలో కలిసి కనిపించి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన అక్కినేని ఫ్యామిలీ మళ్ళీ అలాంటి సెలబ్రేషన్ మూమెంట్ క్రియేట్ చెయ్యడానికి రెడీ అయ్యింది.అక్కినేని నాగేశ్వరరావు నుండి మొదలు పెట్టి నాగార్జున,నాగ చైతన్య,అఖిల్ ఇలా మూడు తరాల కలయికలో వచ్చిన ఆ సినిమా అక్కినేని అభిమానులకు ఆల్ టైం ఫేవరెట్ మూవీ.నిజంగానే అదొక మోడరన్ క్లాసిక్ అనదగ్గ సినిమా.

ఇక నాగార్జునకి ఈ మధ్యకాలంలో అదిరిపోయే సక్సెస్ ఇచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో బంగార్రాజు అనే పాత్ర ని తీసుకుని అదే టైటిల్ తో ఒక ప్రీక్వెల్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సీక్వెల్ లో నాగ చైతన్య కూడా ఒక క్యారెక్టర్ చేస్తున్నాడు.పైగా అది బంగార్రాజు మనవడు క్యారెక్టర్ అంటున్నారు.అది ఎలా పోజిబుల్ అనేది సినిమాలో చూడాలి.కాకపోతే నాగార్జున ని,చైతు ని ఒక ఫ్రేమ్ లో మాత్రం చూడొచ్చు.

అయితే ఇదే సినిమాలో అఖిల్ కి కూడా ఒక చిన్న గెస్ట్ రోల్ కోసం నాగార్జున ని ఒప్పించుకోవాలి అనేది కళ్యాణ్ కృష్ణ ఆలోచన.కానీ దానికి నాగ్ పర్మిషన్ ఇస్తాడా? లేదా? అనేది డౌట్.ఎందుకంటే కథ డిమాండ్ చేస్తే తప్ప ఇలాంటి వాటికి నాగార్జున ఓకే చెప్పడు.పైగా అప్పట్లో ఇంకా అఖిల్ హీరో గా ఇంట్రడ్యూస్ అవ్వలేదు.అందుకే అలా ఇంట్రో బిట్ సెట్ చేసారు.అది బాగా పేలింది కూడా.

మరి బంగార్రాజులో అఖిల్ నటించాలి అంటే మాత్రం అతనికి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే ఒక క్యారెక్టర్ ని డిజైన్ చెయ్యాలిసి ఉంటుంది.అన్నీ అనుకున్నట్టు జరిగి అక్కినేని హీరోలు ముగ్గురు ఒక ఫ్రేమ్ లో కనబడితే అక్కినేని ఫ్యాన్స్ కి అది ఫెస్టివ్ మూమెంట్ అవుతుంది.