రవి తేజ హీరోయిన్ తో సాయి ధరమ్ తేజ్…!

Malavika Sharma
Malavika Sharma

మెగా ఫ్యామిలీ నుండి సాయి ధరమ్ తేజ్ మెగా మేనల్లుడి గా అరగ్రేటనం చేశాడు.మొదట్లో మామయ్య లకు తగ్గ మేనల్లుడిగా దూసుకుపోయిన సాయి ధర్మ తేజ్ రాను రాను ఎక్స్పరిమెంట్ లు చేస్తూ ఫ్లాప్ లను మూటకట్టుకుంటూ కెరీర్ ను ప్రమాదం లో పడేసుకున్నాడు. కాని 2019 లో తన రూట్ ని మార్చుకొని చిత్రలహరి తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ ని అందుకున్నాడు.తను ఎప్పటినుండో వేచి చూస్తున్నా హిట్ రావడం తో సాయి ధర్మ తేజ్ తన వేగాన్ని పెంచాడు. ప్రసుత్తం గీత ఆర్ట్స్ బ్యానర్ లో దర్శకుడు మారుతి దర్శకత్వంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో తేజ్ కు జోడిగా నేల టికెట్ హీరోయిన్ మాళవిక నటించబోతునట్లు సమాచారం.