మజిలీ తో జెర్సీ పోటీ

Jersey-Majili
Jersey-Majili

సంక్రాంతి లాంటి భారీ సీజన్ ముగియడంతో ఇప్పటికయితే పెద్ద సినిమాల హంగామా పెద్దగా లేదు.కానీ సమ్మర్ లో మాత్రం ఈ సందడికి కొదువలేదు.అయితే సమ్మర్ రిలీజ్ ని ముందుగా ఆక్యుపై చేసిన మహర్షి అనివార్యకారణాలతో వెనక్కి వెళ్ళాడు.దాంతో మిగతా సినిమాలు ముందు వస్తున్నాయి.మీడియం బడ్జెట్ లో తెరకెక్కుతున్న రెండు సినిమాలు ఒకే డేట్ కోసం పట్టుబడుతున్నాయి.మహర్షి ని వాయిదా వెయ్యడం వల్ల రెండు సినిమాలకు క్లాష్ వచ్చింది.

మీడియం రేంజ్ హీరోలుగా ఉన్న చైతూ అండ్ నాని లా మధ్య ఈ క్లాష్ వచ్చిందిఈ రేస్ లో ఉన్న ఫస్ట్ సినిమా మజిలీ.పెళ్లయిన తరువాత సమంత,చైతూ కలిసి చేస్తున్న సినిమా ఇది.దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.ముందుగా ఈ సినిమాకి ఎలాంటి రిలీజ్ డేట్ ఇవ్వలేదు.కానీ ఒక్కసారి మహర్షి పోస్ట్ పోన్ అయ్యింది అనగానే ఉగాది కూడా కలిసొచ్చే ఆ డేట్ ని మజిలీ టీమ్ రిజర్వు చేసుకుని పోస్టర్స్ కూడా ఇచ్చారు.

సమ్మర్ కి ముందు మంచి గ్యాప్ ఉండడంతో ఆ సినిమాలో కనీసం కంటెంట్ ఉన్నా కూడా వసూళ్లపరంగా పెద్దగా ప్రాబ్లెమ్ ఉండదు.పైగా మజిలీ కాస్త లిమిటెడ్ బడ్జెట్ లోనే తెరకెక్కుతుంది.కాకపోతే శివ నిర్వాణకి ఇది సెకండ్ సినిమా.మరి టాలీవుడ్ లో విస్తృతంగా వర్క్ అవుట్ అయ్యే సెకండ్ సినిమా సిండ్రోమ్ ని అతను ఎంతవరకు దాటుతాడు అనేది వేచి చూడాలి.అదే డేట్ కోసం చూస్తున్న మరొక సినిమా జెర్సీ.ఈ సినిమా పేరుకి మీడియం బడ్జెట్ అంటున్నా కూడా నాని కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ.

ఈ సినిమా బడ్జెట్ కేటాయింపులకు వీలుగా నాని రిస్క్ చేసి తన రెమ్యునరేషన్ కి బదులు లాభాల్లో వాటా అనే పద్ధతి ఫాలో అవుతున్నాడు.నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 19 కి షెడ్యూల్ అయ్యింది.కానీ మహర్షి వల్ల ఇప్పడు డేట్ మార్చుకోవాల్సి వచ్చింది.అయితే వెనక్కి వెళితే మళ్ళీ అలాంటి డేట్ దొరకదు అందుకే ముందుకు వద్దాం అనుకుంటున్నారు.ఈ రెండు సినిమాల జోనర్స్ వేరు.ఒకటి లవ్ ఎంటెర్టైనెర్ అయితే రెండోది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఎమోషనల్ డ్రామా.

నాని బ్రాండ్ చాలు ఈ సినిమా దూసుకుపోవడానికి.కాకపోతే రెండు కూడా పీరియాడిక్ మూవీస్ కావడం అనేది కాస్త ఆలోచించాల్సిన విషయం.సినిమాలో కంటెంట్ ఎలా ఉన్నా అదే జోనర్ అంటే బోర్ కొట్టేసే అవకాశం ఉంది.చివరకు ఎవరు ముందుకు వస్తారో,ఎవరు వెనక్కి తగ్గుతారు అనేది ఇప్పటికయితే నో క్లారిటీ.