మజిలీ కలెక్షన్స్ రిపోర్ట్

Majili
Majili

నాగ చైతన్య హీరో గా తెరకెక్కిన సినిమా మజిలీ.ఈ సినిమాలో సమంత హీరోయిన్ అనగానే సూపర్ అటెన్షన్ వచ్చింది.దానికి తగ్గట్టుగానే బ్యాక్ క్రియేట్ అయ్యింది.ఇక మొదటి ఆట పడగానే టాలీవుడ్ కామన్ సెంటిమెంట్ అయిన సెకండ్ సినిమా ఫెయిల్యూర్ ని కూడా సక్సెస్ ఫుల్ గా దాటాడు డైరెక్టర్ శివ నిర్వాణ.గోపిసుందర్ మ్యూజిక్,తమన్ ఆర్.ఆర్,శివ నిర్వాణ రైటింగ్ అండ్ డైరెక్టోరియల్ స్కిల్స్ ఈ సినిమాకి మేజర్ ఎస్సెట్స్ గా నిలిచాయి.చైతు ప్రెజెన్స్ అండ్ పెర్ఫార్మెన్స్ కి సమంత ఫ్యాక్టర్ కూడా యాడ్ అవ్వడంతో మజిలీ కి హిట్ స్టాంప్ పడిపోయింది.మజిలీ కి పెద్దగా పోటీ కూడా లేకపోవడంతో సునాయాసంగానే 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ అందుకుంది.అయితే మజిలీకి ఉన్న టార్గెట్ పెద్ద కష్టం అయ్యింది కాకపోవడంతో బయ్యర్స్ కి కూడా ఫస్ట్ వీక్ ఎండ్ లో పెట్టిన పెట్టుబడులు వచ్చేసాయి.మిగతా సినిమాలు వస్తున్నా కూడా మెల్లగా తన రన్ కొనసాగించిన మజిలీ 34 కోట్లకు పైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ తో తన రన్ చాలించింది.ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడులు,అమ్మిన రేట్లు,వచ్చిన రిటర్న్స్ చూస్తే ఈ సినిమా సూపర్ హిట్ అని చెప్పుకోవాలి.మొత్తానికి ఒక్క హిట్ ప్లీజ్ అన్న చైతు కి సూపర్ హిట్ దొరికింది.అయితే ఈ హిట్ లో సమంత లక్ ఎక్కువ క్రెడిట్ దక్కించుకోవడం విశేషం.