మహేష్-సుక్కు…ఇన్నర్ మ్యాటర్ ఇదే

Mahesh-Sukumar
Mahesh-Sukumar

రంగస్థలం తో సుకుమార్ ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టడం,ఆ క్రెడిట్ అంతా సుకుమార్ అకౌంట్ లోకి వెళ్లడంతో గతంలో ‘1’నేనొక్కడే లాంటి కమర్షియల్ డిజాస్టర్ ఇచ్చిన సుకుమార్ కి మళ్ళీ పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు మహేష్.అయితే ప్రొడక్షన్ హ్యూస్ మైత్రి కూడా సుకుమార్ ని ఇంకో రెండు సినిమాలకు లాక్ చేసింది.ఇక శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ తో మహేష్ కి మంచి రేపో ఉండడంతో ఆ ప్రాజెక్ట్ ఈజీగా సెట్ అయిపొయింది.కానీ సినిమా ఓకే అయినంత ఈజీగా సినిమా కథ ఓకే కాలేదు.రంగస్థలం హ్యాంగోవర్ లో ఉన్న సుకుమార్ కోస్తా నుండి తెలంగాణ కి బ్యాక్ డ్రాప్ మార్చి రజాకార్ల నేపధ్యంలో నడిచే ఒక పీరియాడిక్ మూవీ నెర్రెట్ చేసాడు.

మహేష్ బావుంది అన్నాడు కానీ ఈ మధ్య పీరియాడిక్ కథలు పదుల సంఖ్యలో వస్తుండడంతో నో చెప్పాడు.ఈ లోగా సుకుమార్ డైరెక్టర్ గా కంటే ప్రొడ్యూసర్ గా బిజీ అయ్యాడు.మరో పక్క మహేష్ మహర్షి సినిమా షూట్ పూర్తికావొచ్చింది.కానీ సుక్కు లైన్ ఓకే చేయించుకోలేకపోయాడు.మహేష్ మరో ఆల్టర్ నేటివ్ అనుకున్న సందీప్ రెడ్డి వంగా కూడా మహేష్ కి నప్పే స్టోరీ చెప్పలేకపోయాడు.దాంతో ఈ సంవత్సరం టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన F2 డైరెక్టర్ అనిల్ రావిపూడి లైన్ లోకి వచ్చాడు.అతను గతంలోనే మహేష్ కి ఒక లైన్ చెప్పాడు.

దాంతో మహేష్ ఆ లైన్ ని ఓకే చేసి సినిమాకి కమిట్ అయ్యాడు.దాంతో ఇప్పటివరకు మహేష్ ని కథతో ఒప్పించుకోలేకపోయిన సుక్కు ఇగో హర్ట్ అయ్యింది.అక్కడికి మహేష్ ఒక లైన్ బావుంది దానిమీద వర్క్ చెయ్యమని చెప్పినా కూడా సుక్కు సాటిస్ఫాయి అవ్వలేదు.బన్నీ తో సుక్కు కి ఉన్న రేపో వేరు.దాంతో మహేష్ రిజెక్ట్ చేసిన సినిమాని బన్నీ కి చెప్పి ఓకే చేయించుకున్నాడు.పైగా బన్నీ ఇచ్చిన ఆఫర్ ని పట్టించుకోని అనిల్ రావిపూడి మహేష్ దగ్గర ఉండడంతో బన్నీ చాలా త్వరగా ఈ డెసిషన్ తీసుకోవడానికి కారణం.

మరో పక్క మహేష్ లానే త్రివిక్రమ్ అండ్ సుకుమార్ సినిమాలను ఒకేసారి పట్టాలెక్కించడం అనే టార్గెట్ తో మెల్లిగా వర్క్ చేస్తున్న త్రివిక్రమ్ పై కూడా ప్రెజర్ తేవచ్చు అనేది గీత కాంపౌండ్ ప్లాన్ అని తెలుస్తుంది.అయితే ఈ విషయాన్నీ నేరుగా కాకుండా PRO ట్వీట్ ద్వారా చెప్పారు.ఈ ట్వీట్ తో ఒక పక్క మహేష్ అలెర్ట్ అవుతాడు అని సుక్కు,గురూజీ ఫాస్ట్ గా మూవ్ అవుతాడు అని బన్నీ అనుకున్నారు.కానీ సుకుమార్ కి మహేష్ అనుకోని,అస్సలు ఊహించని ఝలక్ ఇచ్చాడు.సుకుమార్ తో సినిమా లేదని డైరెక్టర్ గా క్లారిటీ ఇచ్చి మొదలవకుండానే ఆ సినిమాకి ఎండ్ కార్ట్ వేసేశాడు.

దీంతో అసలు ఈ డెసిషన్ లో ఏ మాత్రం ఇన్వాల్వ్మెంట్ లేని మైత్రి మూవీ మేకర్స్ కూడా మహేష్ దగ్గర బ్యాడ్ అవ్వాల్సి వచ్చింది.టాలెంట్ పుష్కలంగా ఉన్న సుక్కు కి దానికి తగ్గ ప్లానింగ్,పరిస్థితులకు అనుగుణంగా పట్టువిడుపు ఉండకపోవడంతో లేని పోనీ తలనొప్పులు ఎదురవుతున్నాయి.ఈ అనౌన్స్మెంట్ కి ముందే అల్లు అరవింద్ నమ్రతతో ఈ సినిమా విషయం మాట్లాడారు అని ఒక వార్త వస్తుంది.నిజంగా అలా జరిగి ఉంటే సుక్కు సినిమాపై మహేష్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు.

సో,అది కేవలం పుకారు అని తేలిపోయింది.మొత్తానికి ఈ ఫుల్ ఎపిసోడ్ లో లాభపడాలని చూసిన వాళ్ళకి షాకులు తగిలాయి.ఇలాంటి పనులజోలికి పోకుండా సిన్సియర్ గా తన పని తాను చేసుకుంటున్న అనిల్ రావిపూడి కి మంచి జరిగింది.ముందు నుండి ఆన్ ఆఫ్ మోడ్ లో ఊగిసలాడిన మహేష్ 26 ఇప్పుడు పక్కాగా అనిల్ రావిపూడి చేతికి దక్కింది.సుకుమార్ తో సినిమా క్యాన్సిల్ అయినందుకు మహేష్ ఫ్యాన్స్ హ్యాపీ గా ఫీల్ అవుతుండడం విశేషం.