మహర్షి రిలీజ్ డేట్ ఇదేనా?

maharshi
maharshi

మహేష్ బాబు 25 వ సినిమాగా తెరకెక్కుతున్న మహర్షి పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.ఈ సినిమాలో మహేష్ మూడు గెటప్స్ లో కనిపిస్తున్నాడు.అలాగే ఈ కథలో కూడా శ్రీమంతుడు తరహాలో ఉన్న సోషల్ ఎలిమెంట్ కూడా ఆకట్టుకుంటుంది అనేది టాక్ కూడా సినిమాపై క్యూరియాసిటీ పెంచుతుంది.అయితే షూటింగ్ కి ముందే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన టీమ్ ఇప్పడు ఆ డేట్ మార్చడంతో సినిమా అవుట్ ఫుట్ పై సందేహాలు ఏర్పడేలా చేసింది.అయితే షూటింగ్ అంతా పర్ఫెక్ట్ గా జరుగుతుంది అని ఆ సినిమా టీమ్ చెప్పినా కూడా మార్చిన డేట్ అనౌన్స్ చెయ్యకపోవడంతో ఫ్యాన్స్ కూడా ఆందోళన పడ్డారు.

అందరి అనుమానాలు,భయాలు తొలగిస్తూ ఇప్పడు మహర్షి సినిమాలో కొత్త డేట్ ఇచ్చారు.ఏప్రిల్ 5 న రిలీజ్ కావాల్సిన మహర్షి ఏప్రిల్ 24 కి ఫిక్స్ అయ్యింది.కాకపొతే ఏప్రిల్ 24 అంటే బుధవారం వస్తుంది.మిడ్ వీక్ లో సినిమా రిలీజ్ చెయ్యడం చాల రిస్క్.సినిమా బావుంటే ఓకే.లేదంటే మాత్రం వీక్ ఎండ్ కే థియేటర్స్ ఖాళీ అయిపోతాయి.స్పైడర్ విషయంలో కూడా అలాగే జరిగింది.కాకపోతే ఈ సినిమాని మూడు ప్రెస్టీజియస్ బ్యానర్స్ నిర్మిస్తుండడంతో ఆ భయం అక్కర్లేదు అంటున్నారు.సెంటిమెంట్ కోసం అని రిలీజ్ ని వాయిదా వేసిన టీమ్ గురువారం గాని,శుక్రవారం గాని సినిమా రిలీజ్ చేస్తే బావుంటుంది అనేది ఫ్యాన్స్ రిక్వెస్ట్.మరి మహర్షి రిలీజ్ ప్లానింగ్ ఎలా ఉందో ప్రొడ్యూసర్స్ కే తెలియాలి.