వెనక్కి తగ్గిన మహర్షి

Mahesh Babu, Maharshi
Mahesh Babu, Maharshi

మహేష్ బాబు 25 వ సినిమా అనే ట్యాగ్ తో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా మహర్షి.టాలీవుడ్ లో టాప్ బ్యానర్స్ అయిన SVC,వైజయంతి మూవీస్,PVP సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి షూటింగ్ స్టార్ట్ అవుతున్న టైం లోనే రిలీజ్ డేట్ ఇచ్చారు.

అందుకు అనుగుణంగానే ఎక్కడా ఏ లేట్ లేకుండా షూటింగ్ జరుపుతూ వచ్చారు.కానీ ఈ సినిమా ముందుగా ప్రకటించినట్టుగా ఏప్రిల్ 5 న రిలీజ్ కావట్లేదు అనేది లేటెస్ట్ టాక్.దానికి కారణం మహేష్ సినిమాల సెంటిమెంట్ అను తెలుస్తుంది.మహేష్ బాబు సినిమాకి మూడక్షరాల టైటిల్ పెడితే హిట్ అవుతాయి అనే సెంటిమెంట్ తో పాటు ఏప్రిల్ లాస్ట్ వీక్ లో థియేటర్స్ లోకి వస్తే బ్లాక్ బస్టర్స్ కొడతాయి అనే సెంటిమెంట్ కూడా ఉంది.అందుకే ఈ సినిమాని ఏప్రిల్ లాస్ట్ వీక్ షిఫ్ట్ చేసారు.దాంతో ఆ డేట్ ని నాగ చైతన్య అండ్ నాని ఆక్యుపై చేసారు.నాగచైతన్య-సమంత కలిసి నటిస్తున్న మజిలీ కి ఈ డేట్ ఫిక్స్ చేసారు.అలానే నాని హీరో గా నటిస్తున్న స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా జెర్సీ కూడా చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది.

ఈ సినిమా కూడా ఆ డేట్ కే రిలీజ్ చెయ్యాలి అనేది ప్లాన్.ఈ మధ్య వరుసగా రెండు ఫ్లాప్స్ అందుకున్న మైత్రి మూవీ మేకర్స్,ఆల్రెడీ డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్స్ లో ఉన్న సాయిధరమ్ తేజ్ హీరోగా నిర్మిస్తున్న సినిమా చిత్రలహరి.నేను శైలజ సినిమాతో హిట్ అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ కిషోర్ తిరుమల రూపొందిస్తున్న ఈ సినిమా పట్ల ఇండస్ట్రీ వర్గాల్లో మంచి క్యూరియాసిటీ ఉంది.ఈ సినిమాని కూడా ఏప్రిల్ 12 న రిలీజ్ చెయ్యాలి అనేది ప్లాన్.మహర్షి సినిమా వెనక్కు వెళ్లడంతో మీడియం రేంజ్ సినిమాల రిలీజ్ డేట్స్ పై క్లారిటీ వచ్చింది.దీంతో సమ్మర్ లో సినిమాల సందడి బాగానే ఉంది అర్ధమవుతుంది.ఉగాది పండగ కూడా కలిసి రావడం,సమ్మర్ సీజన్ కూడా తోడవ్వడంతో మంచి టాక్ తెచ్చుకున్న సినిమాకి కలెక్షన్స్ పంటపడినట్టే.