మహేష్ లేట్… మహర్షి వాయిదా?

Mahesh Babu, Maharshi
Mahesh Babu, Maharshi

మహేష్ బాబు…టైమింగ్ ఉన్ననటుడు మాత్రమే కాదు టైం కి సెట్స్ కి వచ్చి అనుకున్న సీన్స్ అన్నీ పూర్తి చేసి వెళతాడు.అతను వర్క్ లో చాలా సిన్సియర్ గా ఉంటాడు.అయితే అదంతా గతం అంటున్నారు మహర్షి సినిమాకి పనిచేస్తువాళ్ళలో కొంతమంది.పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక వ్యక్తి మహేష్ తాజా తీరు గురించి మాత్రం చాలా చెప్పుకొచ్చాడు.మహేష్ కి గతంలో సినిమా ఒక్కటే వ్యాపకం.ఇంటిదగ్గర బయలుదేరితే లొకేషన్,షూటింగ్ ప్యాక్ అప్ అయితే ఇల్లు,షెడ్యూల్ గ్యాప్ లో టూర్స్.కానీ రాను రాను మహేష్ అనేక వ్యాపారాల్లోకి అడుగు పెడుతున్నాడు.

దాంతో కేవలం నమ్రత జోక్యం సరిపోవట్లా.అందుకే మహేష్ కూడా మిగతావాటికి కూడా టైం కేటాయించవలసి వస్తుంది.దీంతో ఈ మధ్య మహేష్ షూటింగ్ కి రావడం లేట్ అవుతుంది అని టాక్.ఎప్పుడో ఒకేసారి జరిగితే ఓకే,కానీ ఈ మధ్య ఎక్కువగా,ఎప్పుడూ అదే జరుగుతుంది అని అంటున్నారు.దీంతో వేసున్న షెడ్యూల్స్ అన్నీ కూడా పొడిగించాల్సి వస్తుంది.వంశీ పైడిపల్లి చెక్కుడికి,మహేష్ లేట్ కూడా తోడవడంతో ఇప్పటికే మహర్షి రిలీజ్ డేట్ ఏప్రిల్ 5 నుండి ఏప్రిల్ 26 కి మారింది.అయినా కూడా ఇంకా సినిమాలో రెండు కీలక షెడ్యూల్స్ షూట్ చేయాల్సి ఉంది.దీంతో మహర్షి ఏప్రిల్ లో రావడం కష్టం అంటున్నారు.

ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే అసలు సమ్మర్ బరిలోనే లేదు అనే టాక్ గట్టిగా వినిపిస్తుంది.ఈ సినిమాని జూన్ కి పోస్టుపోన్ చేస్తున్నారు అంటున్నారు.అసలు మహర్షి విషయంలో ఒక స్టాండ్ అంటూ లేకపోవడంతో అసలు ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది?,ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయంలో మేకర్స్ కే క్లారిటీ లేదు అంటున్నారు.మొత్తానికి మహేష్ లేట్ వల్ల మహర్షి లేట్ అవడం అనేది మాత్రం ఫ్యాన్స్ కి ఇబ్బందిగా అనిపిస్తుంది.