మహేష్-సుక్కూ…మ్యాటర్ క్లియర్?

Mahesh Babu Calls Of Sukumar's Project
Mahesh Babu Calls Of Sukumar's Project

మహేష్ బాబు-సుకుమార్ ల కాంబినేషన్ లో సినిమా…ఈ మాట రంగస్థలం రిలీజ్ అయినా దగ్గరినుండి వినిపిస్తూనే ఉంది.మధ్యల సుకుమార్ వెళ్ళి మహేష్ కి కథ చెప్పడం,కథ బాగానే ఉన్నా పదుల సంఖ్యలో వస్తున్న పీరియాడిక్ సినిమాల మధ్యలో ఇది ప్రత్యేకమైన సినిమాగా కనిపించదు అని మహేష్ అనడంతో సుక్కకూ వేరే కథ చెబుతా అని రా బ్యాక్ డ్రాప్ లో ఒక కథ చెప్పాడు.అది నచ్చినా కూడా ఇమేజ్ పరంగా ఉన్న ఇబ్బందులతో వద్దు అనుకున్నాడు.సింపుల్ గా చెప్పాలంటే 1 నేనొక్కడినే సినిమా విషయంలో చేసిన మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అనుకున్నాడు.

మహేష్ డెసిషన్స్ తో విసిగిపోయిన సుకుమార్ డైరెక్షన్ సైడ్ నుండి ప్రొడక్షన్ వైపు వచ్చాడు.తన బ్యానర్ పై వరుసగా సినిమాలు సెట్ చేసే పనిలో మహేష్ సినిమా విషయం పక్కకి వెళ్ళింది.ఈ లోపు F2 తో ఒక బ్లాక్ బ్యస్టర్ కొట్టి మహేష్ తో సినిమా దక్కించుకున్నాడు అనిల్ రావిపూడి.అతను పాయింట్ అండ్ స్క్రిప్ట్ తో రెడీ గా ఉండడంతో అతని సినిమా ఓకే చేసాడు మహేష్.దీంతో సుకుమార్ ఇగో హార్ట్ అయ్యి బన్నీ తో సినిమా అనౌన్స్ చేయించాడు.విషయం అర్ధమయిన మహేష్ సుకుమార్ తో సినిమా కాల్సిల్ చేసాడు.ఇదీ అందరికి తెలిసిన స్టోరీ.కాకపోతే ఇప్పుడు మాత్రం మహేష్-సుకుమార్ మళ్ళీ కలిసిపోయారట.

ఇన్ డైరెక్ట్ గా కటీఫ్ చెప్పుకుని వారం కూడా గడవకముందే ఈ ప్యాచ్ అప్ ఎలా అయ్యింది అనుకుంటున్నారా?…స్టోరీ విషయంలో లేట్ గా రియలైజ్ అయిన సుక్కు వివాదం విషయంలో త్వరగానే స్పందించాడు.తన తొందరపాటు వాళ్ళ కలిగే నష్టం అర్ధమయ్యి మహర్షి సెట్స్ కి వెళ్ళి మహేష్ ని కలిసాడు.బన్నీతో సినిమా అనౌన్స్ చెయ్యడానికి కారణం కూడా వివరించి సారీ చెప్పాడట.మహేష్ వేసిన గంటల వ్యవధిలో మైత్రి వాళ్ళు కూడా వెళ్ళి మహేష్ ని కలిసి వచ్చారు.తరువాత సుక్కు కూడా ఫార్మాలిటీ పూర్తి చేసాడు.దీంతో బయటికి ఆల్ ఈజ్ వెల్ అనే సిట్యుయేషన్ కనిపిస్తుంది.కానీ ఇది అంత తేలిగ్గా ముగిసిపోయే విషయం కాదు.మహేష్ సుకుమార్ ఎంత నమ్మితే సినిమా ఇచ్చాడో,ఎంత హార్ట్ అయితే దాన్ని క్యాన్సిల్ చేసాడో అర్ధం చేసుకోవడం పెద్ద కష్టం కాదు.మహేష్ నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన మళ్ళీ సుకుమార్ తో సినిమా చేస్తాడు అని గ్యారంటీ లేదు.

ఇదే మాట మహేష్ కి ముందు చేపి ఉంటే ఏ గొడవ ఉండేది కాదు.రంగస్థలం విజయంతో సుకుమార్ కాస్త ఎక్కువగా సెల్ఫ్ ఎస్టిమేషన్ వేసుకున్నాడు.దీంతో మ్యాటర్ రివర్స్ అయ్యింది.