సుకుమార్ కి ఏమైంది?

Sukumar
Sukumar

రంగస్థలం లాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ కి ఎలాంటి క్రేజ్ రావాలో అంత క్రేజ్ సుకుమార్ కి వచ్చింది.ఆల్రెడీ ఒకసారి ప్లాప్ ఇచ్చిన మహేష్ మళ్ళీ పిలిచిమరీ సినిమా ఇచ్చాడు.దాంతో పాటే ఆ సినిమా కథ తయారు చేసుకోవడానికి చాలా టైం కూడా ఇచ్చాడు.కానీ మహేష్ ఇచ్చిన టైం లో సుక్కు కథ లైన్ వరకు చెప్పగలిగాడు.దీంతో మహేష్ అనిల్ రావిపూడి తో సినిమాకి రెడీ అవుతున్నాడు.

అయితే కనీసం ఇప్పుడయినా అలెర్ట్ అయ్యి సినిమా స్క్రిప్ట్ మీద కూర్చోవాల్సిన సుకుమార్ ఇంకా నిర్మాతగా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నాడు.మెగా డాటర్ మెయిన్ లీడ్ గా ఒక కథ తయారు చేసి ఆమెని ఒప్పించాడు.ఇక తన బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ తో పాటు అంజనా లేదంటే గీత ఆర్ట్స్ తో కలిసి ఈ సినిమాని నిర్మించడానికి మంతనాలు జరుపుతున్నాడు.

మహేష్ లాంటి స్టార్ హీరో కథ ఓకే చేసి స్క్రిప్ట్ అడిగితే సుకుమార్ ఇలా నిర్మాతగా బిజీ గా ఉండడం ఏంటో అర్ధం కావట్లేదు.మహేష్ కి,సుకుమార్ కి ఎక్కడయినా డిఫరెన్సెస్ వచ్చాయా అనే డిస్కషన్ కూడా నడుస్తుంది.మొత్తానికి సుకుమార్ ని నమ్ముకుని మహేష్ తో సినిమాకి ప్రిపేర్ అయిన మైత్రి కి ఆ ఆశ నెరవేరేటట్లు కనిపించట్లేదు.అసలు సుకుమార్ కి ఏమైంది? అనేది మహేష్ అభిమానులకు సమాధానం దొరకని ప్రశ్నగా మారింది.