షూటింగ్ పూర్తి చేసుకున్న మహర్షి…!

Maharshi
Maharshi

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు,పూజా హెగ్డే హీరో,హీరోఇన్లు గా నటిస్తున్న చిత్రం ‘మహర్షి’. అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇక తాజాగా ఈ చిత్ర షూటింగ్ బుధువారం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ దీనిని సెలెబ్రేట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసింది.కాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. దేవి శ్రీఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు, అశ్వినీదత్ , పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 9న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.