న్యూ ఇయర్ కిక్ మరింతగా పెంచిన మహర్షి సెకండ్ లుక్

Mahesh Babu, Maharshi
Mahesh Babu, Maharshi

మహర్షి…2019 లో బిగ్గెస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్ లో ఉన్న సినిమా.ఇప్పటికే ఈ సినిమానుండి అనేక పిక్స్ అండ్ లుక్ అఫీషియల్ గా రిలీజ్ అయ్యాయి.మరికొన్ని మాత్రం లీకుల రూపంలో బయటికి వచ్చాయి.అయితే న్యూ ఇయర్ సందర్భంగా సూపర్ స్టార్ అభిమానులకు సెలబ్రేషన్ మూడ్ మరింతగా పెంచేలా ఈ సినిమా సెకండ్ లుక్ రిలీజ్ చేసింది సినిమా టీమ్.

ఫస్ట్ లుక్ లో రఫ్ గా గడ్డంతో మ్యాన్లీ గా కనిపించిన మహేష్ ఇప్పుడు మాత్రం క్లీన్ షేవ్ తో చాలా నీట్ గా కార్పొరేట్ లుక్ లో కనిపిస్తున్నాడు.ఈ పిక్ చూస్తే వయసు పెరుగుతున్న కొద్దీ మహేష్ ఏజ్ తగ్గుతుందా అనే రొటీన్ క్వశ్చన్ మళ్ళీ ఎదురవుతుంది.టాలీవుడ్ లో అగ్రస్థానంలో ఉన్న మూడు ప్రెస్టీజియస్ బ్యానర్స్ కలిసి రూపొందిస్తున్న ఈ సినిమా ఇప్పటివరకు చాలా సింపుల్ గా కనిపించింది.

ఈ రీసెంట్ లుక్ లో మాత్రం భారీతనం అండ్ లావిష్ నెస్ ఆకట్టుకుంటున్నాయి.ఈ సినిమాలో మహేష్ రెండు షేడ్స్ లో కనిపిస్తాడు అని ముందు నుండి ప్రచారం జరుగుతుంది అందుకు తగ్గట్టే మహర్షి పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఈ లుక్స్ ఉన్నాయి.2018 సమ్మర్ లో భరత్ అనే నేను తో బ్లాక్ బస్టర్ కొట్టిన మహేష్ 2019 లో తన 25 వ సినిమా అయిన మహర్షి తో అలరించబోతున్నాడు.