పవన్ కి మహర్షి స్పెషల్ షో

Pawan Kalyan
Pawan Kalyan

మహేష్ బాబు నటించిన 25 వ సినిమా మహర్షికి కి మంచి టాక్ దక్కింది.ఆ సినిమాలో చూపించిన రైతులకు రెస్పెక్ట్ ఇవ్వాలి,వ్యవసాయాన్ని అంతా అలవాటు చేసుకోవాలి అనే కాన్సెప్ట్ ఎక్కువమందికి కనెక్ట్ అయ్యింది.దీంతో ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఈ మహర్షి సినిమా చూడాలని డిసైడ్ అయ్యారట.పవన్ కి కూడా వ్యవసాయం అంటే ఎంత ఇష్టమో తన ఫామ్ హౌస్ నుండి పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే తెలుస్తుంది.అందుకే పవన్ మహర్షి గురించి విని చూడాలని ఆసక్తిగా ఉన్నాడు.దీంతో ఆయనకి స్పెషల్ షో వేసేందుకు ఏరాట్లు చేస్తున్నారు.

పవన్ తన సినిమాలు చూసుకోవడమే తక్కువ,చివరికి చిరు రీ ఎంట్రీ మూవీ కూడా చూడలేదు.అలాంటిది పవన్ మహేష్ సినిమా చూస్తున్నాడు అంటే దానికి ఉండే వెయిట్ వేరు.ఇప్పుడు మహర్షి పబ్లిసిటీ కి అది కూడా చాలా బూస్ట్ అవుతుంది.ఈ సినిమాకి ఎక్కువ బడ్జెట్ అయ్యింది.దాంతో సినిమా టాక్ నిలబెట్టుకోవడానికి టీమ్ రకరకాల ప్రయత్నాలు చేస్తుంది.ఇక ఊహించని ఈ పరిణామంతో మహర్షికి అదనపు మైలేజ్ వచినట్టే.మొత్తానికి సూపర్ స్టార్ సినిమాకి పవర్ స్టార్ ప్రచారం మాత్రం హైలైట్.