మహర్షి బజ్ కోసం…

Maharshi
Maharshi

మహేష్ బాబు ప్రతిష్టాత్మక సినిమా మహర్షి కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.ముందు అనుకున్న రిలీజ్ డేట్ రెండు సార్లు మారడంతో ఈ సినిమాపై అనుకున్నంత బజ్ క్రియేట్ కాలేదు అనేది నిజం.దానికి తోడు ఫస్ట్ సింగల్ ఒక మోస్తరుగా ఉండడం,టీజర్ కూడా శ్రీమంతుడు సినిమాని పోలిఉంది అనే టాక్ కూడా వినిపించింది.దీంతో ఈ సినిమాకి కూడా ”భరత్ అనే నేను…” తరహా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు.అంతకుముందు వరకు మహేష్ బాబు సినిమాకి డిజిటల్ ప్రమోషన్స్ వింగ్ ఉండేది కాదు.ఆ సినిమా నుండే అది స్టార్ట్ అయ్యింది.

మహర్షి కి కూడా అదే తరహాలో డిజిటల్ గా స్ట్రాంగ్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు.అలాగే ఏ తెలుగు సినిమాకి అయినా US నుండి బయటికి వచ్చే టాక్ కీలకంగా మారుతున్న తరుణంలో ఆ విషయం పై కూడా యూనిట్ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమా నుండి బయటికి వచ్చిన సెకండ్ సాంగ్ సినిమాలో రిచ్ విజువల్స్ తో తెరకెక్కిన ఫస్ట్ సాంగ్ అని అర్ధమవుతుంది.మహర్షి ఫస్ట్ సాంగ్ కంటే ఇది అందరికి బాగా కనెక్ట్ అవుతుంది.మరి తన 25 వ సినిమాతో తన ఫ్యాన్స్ తో పాటు తెలుగు సినిమా అభిమానులు కూడా కోరుకునే హిట్ ని మహర్షి అలియాస్ మహేష్ అందిస్తాడో లేదో అనేది మే 9 న తెలుస్తుంది.