మహర్షి రివ్యూ : ఎమోషనల్ జర్నీ !

Maharshi Review in Telugu
Maharshi Review in Telugu

నటీనటులు : మహేష్‌ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్‌, జగపతి బాబు, ప్రకాష్ రాజ
దర్శకత్వం : వంశీ పైడిపల
నిర్మాత : దిల్‌ రాజు, పీవీపీ, అశ్వనీదత
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద
సినిమాటోగ్రఫర్ : కే యూ మోహనన
ఎడిటర్ : కే ల్ ప్రవీణ
విడుదల తేదీ : మే 09, 2019
రేటింగ్ : 2.75/5

శ్రీమంతుడు, భరత్ అనునేను సినిమాలతో సమ్మర్ బ్లాక్ బస్టర్స్ ను అందుకున్న మహేష్ బాబు కి అదొక సక్సెస్ సెంటిమెంట్ గా మారింది. అందుకే తో తన కెరీర్లో మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కిన మహర్షి సినిమాను కూడా సమ్మర్లోనే రిలీజ్ చేశారు.మహేష్ బాబు 25 వ సినిమా అనే ట్యాగ్,మూడు బ్యానర్స్ బ్యాక్ అప్,సమీర్ సీజన్ కూడా కావడంతో భారీ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుని బాహుబలి తర్వాత అత్యదిక స్క్రీన్లలో రిలీజ్ అయిన తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది మహర్షి. రెండుళ్లు వెయిట్ చేసి మరీ వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది.మరి ముందు నుంచీ చెప్తున్నట్లు..మహర్షి అలియాస్ రిషి కుమార్ జర్నీ ఎలా సాగింది?…థియేటర్స్ నెంబర్ లో నాన్ బాహుబలి రికార్డ్స్ దక్కించుకున్న మహర్షి జర్నీకి ప్రేక్షకులు ఎంతవరకూ కనెక్ట్ అయ్యారో ఇప్పుడుచూద్దాం.

నటీనటులు: ఎలాంటి పాత్ర అయినా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో తన బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకులకు చాలా ఈజీగా కనెక్ట్ చేసే సత్తా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాలో కూడా రిషి పాత్రను కంప్లీట్ గా ఓన్ చేసుకున్నాడు. ముఖ్యంగా కాలేజ్ బ్యాక్ డ్రాప్ ఎపిసోడ్ లో స్టూడెంట్ గా మహేష్ మేకోవర్ చాలా క్యూట్ గాఉంది. అతని యాటిట్యూడ్ కూడా చాలా రిఫ్రెషింగ్ గా ఉంది. అల్లరినరేష్,మహేష్ అండ్ పూజా హెగ్డే ల మధ్య సీన్స్ చాలా బాగా పండాయి. కార్పొరేట్ కంపెనీ సీఈఓ గా అల్ట్రా స్టైలిష్ లుక్స్ తో ఓ హాలీవుడ్ రేంజ్ హీరోలా కనిపించాడు మహేష్.ఎమోషనల్ సీన్స్ ని పీక్స్ లో పండించే మహేష్..ఈ సారి కూడా అదేరేంజ్ అవుట్ పుట్ ఇచ్చాడు.స్టోరీ లో భాగంగా వచ్చిన ఫైట్స్ కూడా మహేష్ అభిమానులకు కిక్ ఇస్తాయి. కొన్నిచోట్ల లౌడ్ డైలాగ్ డెలివరీతో మహేష్ బాబు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కి థియేటర్లలో క్లాప్స్ పడుతున్నాయి.ఈసినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన అల్లరినరేష్ కి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ దక్కింది.పేరుకు సపోర్టింగ్ క్యారెక్టర్ అయినా..కథకి కీలకం అయిన పాత్ర దక్కింది.కాలేజ్ బ్యాక్ డ్రాప్ సీన్స్ లో కూల్ కామెడీని పండించిన నరేష్ సెకండాఫ్ లో మాత్రం ఎమోషన్స్ ని సైతం హత్తుకునేలా జనరేట్ చెయ్యగలిగాడు.నరేష్ కెరీర్లో గర్వంగా చెప్పుకునే మెమరబుల్ పాత్రగా నిలిచింది రవి క్యారెక్టర్.ఇక పూజా పాత్రలో కనిపించిన పూజా హెగ్డేకి పెద్దగా స్కోప్ లేకపోయినా ..ఉన్నంతవరకూ తన గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంది.ప్రకాష్ రాజ్, జయసుధల పాత్రలనిడివి తక్కువే అయినా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చెయ్యగలిగారు.రావురమేష్ పాత్ర కూడా చాలా హుందాగా ఉంది.జగపతిబాబు తనకు బాగా అలవాటైన స్టైలిష్ విలన్ పాత్రలో కనిపించి అలరించాడు.నాజర్,ముఖేష్ రిషి,కమల్ కామరాజు,పోసాని,సాయికుమార్,తనికెళ్ల భరణి,వెన్నెల కిషోర్,శ్రీనివాసరెడ్డి,పృథ్వి,మీనాక్షి దీక్షిత్, రాజీవ్ కనకాల,అనన్య ఇలా..ఫేమస్ స్టార్ కాస్ట్ అంతా కూడా తమపాత్రల్లో మహర్షికి సపోర్ట్ చేశారు.

టెక్నీషియన్స్: ఈ సినిమాకోసం రెండేళ్లు వెయిట్ చేసిన వంశీపైడిపల్లి స్క్రిప్ట్ పరంగా చాలా వర్క్ చేశాడు.సినిమాలో చాలా చోట్ల వంశీ కథ కంటే కూడా మహేష్ ని ఎక్కువగా నమ్ముకున్నాడా? అనే డౌట్ వస్తుంది.మహేష్ ని అల్ట్రా స్టైలిష్ హీరోగా ప్రజెంట్ చెయ్యడంలో,కాలేజ్ స్టూడెంట్ గా కాస్త డిఫరెంట్ యాటిట్యూడ్ చూపించడంలో,అలాగే హై స్పీడ్ షాట్స్ తో హీరోయిక్ ఎలివేషన్స్ ఇవ్వడంలోఫుల్ ఫ్లెడ్జ్ గా సక్సెస్ అయ్యాడు.బర్నింగ్ సోషల్ కాజ్ కు కమర్షియల్ టచప్ ఇచ్చి మహర్షి ని ఒక భారీ సినిమాగా మలిచిన వంశీ పైడిపల్లి స్క్రీన్ ప్లే విషయంలో,లెంగ్త్ విషయంలో మాత్రం కాస్త కాంప్రమైజ్ అయ్యాడు.దీంతో లాగ్స్ సీన్స్ ,కథకుఅవసరం లేని సన్నివేశాలు కాస్త ఇబ్బంది పెట్టాయి.చాలా లోపాలను మహేష్ కవర్ చేసినా..కథ విషయంలో ముఖ్యంగా సెకండాఫ్ నెరేషన్ లో మరి కాస్త కేర్ తీసుకుని ఉంటే..మహర్షి నెక్ట్స్ రేంజ్ కి వెళ్లేది.వంశీపైడిపల్లి సెన్సిబిలిటీస్,ఎమోషనల్ కమాండ్, డైలాగ్ పంచింగ్ మాత్రం బావుంది.ఇక ఈ సినిమా అనుకున్న దగ్గరనుంచి వంశీతో జర్నీ కంటిన్యూ చేస్తున్న దేవిశ్రీ ప్రసాద్ పాటల విషయంలో నిరుత్సాహ పరిచినా..ఆర్,ఆర్ పరంగా చాలా హార్డ్ వర్క్ చేసి మహర్షి రేంజ్ అండ్ రీచ్ ని పెంచాడు. సీన్ కంటెంట్ ని చాలా చోట్ల ఎలివేట్ చేసింది ఆర్.ఆర్.K.U మోహనన్ సినిమాటోగ్రఫీ సినిమాకి ఎస్సెట్.ఇప్పటివరకూ టాలీవుడ్ లో చూడని హీరో ఎలివేషన్స్ ఈ సినిమాలో కొన్ని చోట్ల కనిపిస్తాయి.ఇక యు.ఎస్ ఎపిసోడ్ అయితే హాలీవుడ్ సినిమాని చూస్తున్న ఫీలింగ్ కలిగించింది.ఎడిటింగ్ మాత్రం ఇంకాస్త క్రిస్ప్ గా ఉంటే బావుండేది. అశ్వినీదత్ , పి.వి.పి. దిల్ రాజు వంటి పెద్ద నిర్మాతల నిర్మాణవిలువలు టాప్ రేంజ్ లో ఉన్నాయి. మహర్షి కి అవికూడా ఓ హైలెట్ గా నిలిచాయి.

ఫైనల్ గా:మహేష్ బాబు 25వ సినిమాగా ఓ మ్యానియా ని క్రియేట్ చేస్తూ..అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఓ సునామీలా బాక్సాఫీస్ ని ముంచెత్తిన మహర్షి ఎక్కువ శాతం మందికి రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పెద్ద సినిమాలు లేకపోవడం..మహేష్ సక్సెస్ స్వింగ్ కూడా తోడవ్వడం…లాంటివి మహర్షి కి ఏ రేంజ్ లో కలెక్షన్లను కురిపిస్తాయో ..చూడాలంటే వెయిట్ చెయ్యాల్సిందే.బ్లాక్ బస్టర్ ట్యాగ్ ని దక్కించుకోవడం మాత్రం కాస్త కష్టమయిన పనే.

బోటమ్ లైన్ : బాగా ‘సాగి’న రిషి జర్నీ